ఆరులో మూడు వ్యాక్సిన్‌లు వర్క్‌ఔట్ అవుతాయ్.. ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: బిల్ గేట్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వ్యాక్సిన్ తయారీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేయడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భారత్ సహకారం ప్రపంచానికి ముఖ్యమని అన్నారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ అనేది ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం ఎదుర్కొంటున్న రెండవ అతిపెద్ద విషయం. కోవిడ్ -19 వ్యాక్సిన్‌తో ప్రపంచం బయటకు వచ్చిన తర్వాత, దాని భారీ ఉత్పత్తి కోసం ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోందని ఆయన అన్నారు. భారత్‌లో ప్రస్తుతం ఆరు వ్యాక్సిన్‌ పరీక్షలు జరుగుతుండగా.. అందులో మూడు కచ్చితంగా వర్క్‌ఔట్ అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

COVAXIN : కోవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు – భారత్ బయోటెక్


ప్రపంచంలో రెండవ ధనవంతుడైన బిల్ గేట్స్ భారతదేశంపై గొప్ప అంచనాలతో ఉన్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి అనేక కోవిడ్ -19 వ్యాక్సిన్లు చివరి దశలో ఉంటాయని ఆయన చెప్పారు. టీకా ఉత్పత్తి కోసం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని వెల్లడించిన బిల్‌గేట్స్ మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు.
కోవిడ్ -19 వ్యాక్సిన్ రోల్ అవుట్ వచ్చే ఏడాది ఎప్పుడైనా జరగవచ్చునని, భారతదేశంలో పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి ఉంటుందని, అందులో కొంత భాగాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఇవ్వాలని, దీని కోసం ప్రపంచం భారతదేశంపై దృష్టి పెడుతోందని చెప్పుకొచ్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశం భారత్ అని గేట్స్ అన్నారు. ప్రపంచం మొత్తం వీలైనంత త్వరగా భారతదేశంలో వ్యాక్సిన్ రావాలని కోరుకోవాలని, ఇది సమర్థవంతంగా మరియు సురక్షితంగా ఉంటుందని అన్నారు. భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి చర్చలు జరుపుతున్నట్లు గేట్స్ చెప్పారు.
బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా కరోనాకు వ్యతిరేకంగా పోరాటానికి సహాయపడనుందని గేట్స్ అన్నారు. మొదటి త్రైమాసికం నాటికి కరోనా వ్యాక్సిన్ రావచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు. ‘దేశంలో అనేక వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నాయి’ అని హర్ష్ వర్ధన్ అన్నారు. 2021 మొదటి త్రైమాసికం నాటికి దాని ఫలితాలు మనకు ఖచ్చితంగా తెలుస్తాయి.

Related Posts