ప్రపంచంలో కరోనా తర్వాత 50% పైగా బిజినెస్ ట్రావెల్ తగ్గిపోతుంది : బిల్ గేట్స్ జోస్యం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

business travel will disappear in post-coronavirus world : ప్రపంచాన్ని కరోనా వైరస్ అస్తవ్యస్తం చేసింది. కరోనా దెబ్బకు వ్యాపార ప్రయాణాలపై తీరని దెబ్బపడింది. కరోనాకు ముందు వ్యాపార పరంగా ప్రయాణాల పరిస్థితి లాభాదాయకంగా ఉండేది.

కరోనావైరస్ రావడంతో జీవనశైలితో పాటు వ్యాపార ప్రయాణాల్లోనూ అనేక మార్పులకు దారితీసింది. వ్యాపార నిర్వహణ కార్యకలాపాల విషయంలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి.కరోనా తర్వాత కూడా ప్రపంచంలో 50శాతానికి పైగా బిజినెస్ ట్రావెల్ పడిపోతుందని ప్రముఖ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ జోస్యం చెప్పారు.

ఓ సదస్సులో పాల్గొన్న ఆయన.. తాను ఊహించనట్టుగా 50శాతం బిజినెస్ ట్రావెల్, 30 శాతం ఆఫీసుల్లో పని రోజులు తగ్గిపోతాయన్నారు. రానురాను.. బిజినెస్ ట్రిపులకు ఎక్కువ అవకాశం ఉంటుందని గేట్స్ ఊహించారు.


ట్విట్టర్‌ Dislike Button తీసుకోస్తోంది..


ఇంటి నుంచి పని చేయడం సాధ్యమే. అయితే, కొన్ని కంపెనీలు వ్యక్తిగతమైన సమావేశాలను సాధ్యమైనంత ఎక్కువగా తగ్గించే అవకాశం ఉందని అన్నారు. ఆఫీసులకు వెళ్లడం.. బిజినెస్ ట్రావెల్ చేయడం చేస్తారు కానీ, కరోనా ముందు కంటే ఎక్కువగా ఉండకపోవచ్చునని గేట్స్ చెప్పారు.కరోనా మహమ్మారి లాభదాయకమైన బిజినెస్ ట్రావెల్‌కు విమాన ప్రయాణాల డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. వైరస్‌కు ముందు వ్యాపార ప్రయాణికులు యుఎస్ విమానయాన సంస్థల ఆదాయంలో సగం మాత్రమే ఉన్నారు.కానీ కేవలం 30% ట్రిప్పులు చాలావరకు యుఎస్ క్యారియర్‌లపైనే ఆధారపడి ఉందని గేట్స్ అన్నారు. ఎయిర్ ట్రావెల్ ద్వారా వ్యాపార పర్యటనలు మరింత పుంజుకుంటాయని బిల్ గేట్స్ అంచనా వేశారు.

Related Tags :

Related Posts :