లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

వ్యాక్సిన్ తయారీకి అమెరికా యూనివర్సిటీతో మరో ఒప్పందం

Published

on

Biological E company entered into an agreement  to manufacture the vaccine : కరోనా టీకా అభివృద్ధి చేయటానికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్‌-ఈ, అమెరికాకు చెందిన ఓహియో యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా ఓహియో యూనివర్సిటీ అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ ‘ఆర్‌ఎంఈవీఎస్‌’ను బయోలాజికల్‌-ఈ తీసుకుంటుంది. దాని ఆధారంగా టీకా అభివృద్ధి, క్లినికల్‌ ట్రయల్స్‌, మార్కెటింగ్‌కు బాధ్యత వహిస్తుంది.

ఓహియో యూనివర్సిటీ కరోనా వైరస్‌ ఉపరితలంలోని స్పైక్‌ను (కొమ్ము) లక్ష్యంగా చేసుకొని రీకాంబినెంట్‌ మీజిల్స్‌ వైరసెస్‌ (ఆర్‌ఎంఈవీఎస్‌) విధానంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనిని జంతువుల్లో పరీక్షించగా కొవిడ్‌-19 వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయినట్టు తేలింది. తాజా ఒప్పందం ప్రకారం.. బయోలాజికల్‌-ఈ సంస్థ ఈ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ను ఉపయోగించి టీకాను అభివృద్ధి చేస్తుంది. మానవులపై ప్రయోగాలు నిర్వహిస్తుంది.ఈ నేపథ్యంలో సంస్థ ఎండీ మహిమ దాట్ల స్పందిస్తూ ప్రజలకు సురక్షితమైన, సమర్థమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తాజా ఒప్పందం తమ పరిశోధనలకు సహకరిస్తుందని ఆమె పేర్కొన్నారు.