ఏమాత్రం భయం లేదు…కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బర్త్ డే పార్టీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలని హెచ్చరికలుు జారీ చేస్తూనే ఉన్నాయి. కానీ కొంతమంది అవేమీ పట్టన్నట్లు ఇష్టానుసారంగా పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతూ, వేడుకలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది యువకులు పార్టీ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు హోటల్ పై దాడి చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

బంజారాహిల్స్ పరిధిలో ఉన్న పార్క్ హయత్ హోటల్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఓ బర్త్ డే పార్టీ జరిగినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం. అర్ధరాత్రి సమయంలో హోటల్ లో బర్త్ డే పార్టీ హంగామాగా జరిగింది. పార్టీకి సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆకస్మికంగా దాడి చేసి ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. గతంలో జూబ్లిహిల్స్ లో రేవ్ పార్టీ నిర్వహించిన సంతోష్ రెడ్డి మళ్లీ ఈ బర్త్ డే పార్టీకి సూత్రధారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసుల అదుపులో నలుగురు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. పార్టీలో జర్మనీకి చెందిన యువతి కూడా ఉన్నట్లు పోలీసులు సమాచారం. గతంలో రేవ్ పార్టీలకు సంబంధించి నిర్వహించిన సంతోష్ రెడ్డి ఈ పార్టీని కూడా అరెంజ్ చేసినట్లు సమాచారం.

Related Posts