లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రూ. 10 కే బిర్యానీ..యజమాని అరెస్టు..ఎందుకు

Published

on

biryani at Rs 10 on inaugural day : ఏ షాపు ఓపెన్ చేసినా..దానికి ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు. రెస్టారెంట్ ల విషయానికి వస్తే..ఫలానా ఫుడ్ తీసుకంటే..ఇంకో రకమైన ఫుడ్ ఫ్రీ, కూల్ డ్రింగ్ ఉచితం అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటారు. ప్రస్తుతం రూట్ మారిపోతోంది. కేవలం ప్రారంభం రోజునే తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నామని కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ట్రై చేస్తున్నారు.మితిమీరి..ప్రవర్తిస్తుండడంతో వారికి చెక్ పెడుతున్నారు పోలీసులు. రూ. 10కే బిర్యానీ అందిస్తానన్న యజమానిని అరెస్టు చేశారు పోలీసులు. తమిళనాడు రాష్ట్రంలో అరుపుకోట్టాయికి చెందిన జహీర్ హుస్సేన్ స్థానికంగా బిర్యానీ షాపు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం ప్లేట్ బిర్యానీ రూ. 10కే అంటూ యాడ్ ప్రకటించాడు.

చుక్కలను తాకుతున్న ఉల్లి ధర, ఉల్లి లేకుండానే కూర కుత కుత


అంతే.. ఆదివారం ఉదయం 11 గంటలకు బిర్యానీ షాపు ముందు జనాలు క్యూ కట్టారు. కరోనా నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో..ఇలా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు. బారులు తీరిన వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. అప్పటికే షాపు నిర్వాహకులు 500 ప్యాకెట్లను అమ్మేశారు. మిగిలిన వాటిని పేదలకు, వికలాంగులకు, అనాథలకు పంచిపెట్టాలని సూచించారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు జహీర్‌ను విరుదునగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *