BJP boycott call after Deepika's JNU visit

దీపికా పదుకొనె సినిమాలు బహిష్కరించాలని బీజేపీ పిలుపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఢిల్లీలోని JNU క్యాంపస్‌లోకి ముసుగు వ్యక్తులు చొరబడి 30 స్టూడెంట్స్‌ను గాయపరిచారు. బాధితులను పరామర్శించేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పదుకొనె అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా దీపికా ఎవరిని విమర్శించలేదు. ఎటువంటి కామెంట్లు చేయకుండా విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. గాయాలకు గురైన ఐషే ఘోష్‌తో పాటుగా మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ కూడా అక్కడ సమావేశమయ్యారు. 

దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. దీపికా పదుకొనే సినిమాలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో దీపికా పదుకొణె జేఎన్ యూకు వెళ్లారు. దాదాపు 15నిమిషాలు పాటు ఆమె అక్కడే గడిపారు. ఈ క్రమంలో ‘బాయ్ కాట్ చపాక్ హ్యాష్ ట్యాగ్ తో దీపికా పదుకొణె సినిమాలు బహిష్కరించాలంటూ పోస్ట్ లు హల్ చల్ చేస్తున్నాయి.  

దీపికి జేఎన్ యూ విద్యార్ధులను పరామర్శించిన దృశ్యాలు..ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా..జేఎన్ యూలో ముసుగు వ్యక్తులు చేసిన విధ్వసంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. బాలీవుడ్ నటులే కాక..పలు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రముఖులు,రాజకీయ ప్రతినిధులు ఈ దారుణ విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు. 

కాగా దీపిక పదుకొనె  ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘చపాక్‌’. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితకథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2020 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో జేఎన్ యూ విద్యార్దులకు పలకరించటానికి వెళ్లిన దీపికి సినిమాలకు బహిష్కరించాలంటూ బీజేపీ పిలుపునివ్వటం సంచలనంగా మారింది. కాగా దీపికి పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారనే విషయం తెలిసిందే.

 

Related Posts