లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ గెలుపు గుర్రాలు రెడీ.. 50మందితో తొలి జాబితా సిద్ధం

Published

on

bjp candidates ghmc elections: గ్రేటర్‌ ఎన్నికల్లో 50మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేయడానికి బీజేపీ సిద్ధమైంది. ఇవాళ(నవంబర్ 18,2020) మొదటి జాబితా ప్రకటించేందుకు రెడీ అయింది. హయత్‌నగర్‌ నుంచి కల్లెం రవీందర్‌ రెడ్డి, హస్తినాపురం నుంచి నరేశ్‌ యాదవ్‌, జీడిమెట్ల- తారా చంద్రారెడ్డి, సురారం నుంచి సురేష్‌గౌడ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇటు కేపీహెచ్‌బీ- ప్రీతమ్‌ రెడ్డి, ఫతేనగర్‌ నుంచి కృష్ణగౌడ్‌ బరిలో ఉండనున్నారు.

కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి ఇంఛార్జీ రాజీనామా


ఖైరతాబాద్‌ నుంచి సింగారి వీణా మాధురి, మన్సురాబాద్‌- కొప్పుల నరసింహారెడ్డి, గడ్డి అన్నారం- కాసం రాంరెడ్డి, వనస్థలిపురం నుంచి పవన్‌ను బీజేపీ పోటీలోకి దించుతోంది. లింగోజిగూడ నుంచి స్వయం ప్రకాశ్ లేదా జిట్టా సురేందర్‌ రెడ్డి, బీఎన్‌రెడ్డి-వెంకటేశ్వర రెడ్డి, హిమాయత్‌నగర్‌- తులసీ లేదా రామన్‌గౌడ్‌, నాగోల్‌- సురేందర్‌ యాదవ్‌, మాదాపూర్‌- వినయ్‌బాబు, గౌలిగూడ- ఆలె సుజాత, జియాగూడ నుంచి కేశపాగం సాయిరాం, గాంధీనగర్‌ నుంచి పావని వినయ్ లేదా శైలజా గోపాల్ పోటీలో ఉండనున్నారు. మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డి తన వర్గానికే రెండు లేదా మూడు డివిజన్లు కావాలని ఆశిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *