Home » ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్
Published
2 months agoon
By
bheemrajBJP House Motion Petition : గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సర్య్యులర్ పై రాజకీయ రగడ చెలరేగింది. స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్నుతో గీసినా ఓటేసినట్టేనని పేర్కొంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై బీజేపీ మండిపడింది.
ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరుగనుంది. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో వేచిచూడాలి మరి.
ఎన్నికల కమిషనర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వస్తిక్ గుర్తు మినహా ఏదీ ఒప్పుకోకూడదని చెప్పామని తెలిపారు. అయితే కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా ఉండేందుకే అర్ధరాత్రి సర్క్కులర్ ఇచ్చారని పేర్కొన్నారు.