security in India or killing with bombs..

బీజేపీ ఎమ్మెల్యే : భారత్ లో భద్రత లేదంటే బాంబులతో లేపేస్తా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రధాని మోదీ  విమర్శించినా..భారత్ లో భద్రత లేదని అన్నా బాంబులతో పెట్టి మరీ చంపేస్తానని బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో భద్రత లేదు అని ఎవరైనా అంటే వారిని బాంబులతో లేపేయాలని ఎమ్మెల్యే విక్రమ్ సైనీ పిలుపునిచ్చారు.

ఉత్తరప్రదేశ్ : ప్రధాని మోదీ  విమర్శించినా..భారత్ లో భద్రత లేదని అన్నా బాంబులతో పెట్టి మరీ చంపేస్తానని బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో భద్రత లేదు అని ఎవరైనా అంటే వారిని బాంబులతో లేపేయాలని ఎమ్మెల్యే విక్రమ్ సైనీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనతో దేశం అంతా భద్రంగా వుందనీ..దేశం అంతా మోదీకి నీరాజనాలు పడుతోందనీ కానీ కొంతమంది మాత్రం భారత్ లో రక్షణ లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా ఎక్కడ క్షేమంగా ఉంటామని అనుకుంటారో..అక్కడికే వెళ్లిపోవాలని అన్నారు. కానీ పక్షంలో తనకు హోంశాఖ ఇస్తే ఇలా మాట్లాడుతున్న వారందరినీ బాంబులతో లేపేస్తానని హెచ్చరించారు.
 

Related Posts