Home » ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై ఆర్ధిక మంత్రికి లేఖ రాసిన సురేష్ ప్రభు
Published
2 months agoon
By
murthysuresh prabhu wrote a letter to nirmala sitharaman on AP financial status : ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందంటూ కేంద్ర మాజీమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేస్తోందని నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో పేర్కోన్నారు. రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్ధికమంత్రికి ఫిర్యాదు చేశారు.
దీని వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడటమే కాకుండా అభివృద్ధి క్షీణిస్తుందని సురేష్ ప్రభు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే సరైన చర్యలు తీసుకోవాలని ఆయన నిర్మలా సీతారామన్ ను కోరారు. సురేష్ ప్రభు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయినా, ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ఆయన్ను ఏపీ తరఫున రాజ్యసభకు పంపారు. దీంతో టెక్నికల్‌గా సురేష్ ప్రభు ఏపీ తరఫున ఎంపీగా ఉన్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రులకు సురేష్ ప్రభు రాసిన లేఖలు ఇప్పుడు సంచలనమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ఎంపీ సురేష్ ప్రభు లేఖలు రాశారు.