BJP MP Vijay Goyal violates odd-even vehicle policy in Delhi

సరి-బేసి రూల్ ఉల్లంఘించిన బీజేపీ ఎంపీ  

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఢిల్లీలో సరి-బేసి వాహన విధానాన్ని బీజేపీ ఎంపీ  విజయ్ గోయాల్ ఉల్లంఘించారు. దీంతో పోలీసులు ఎంపీకి ఛలానా విధించారు. ఈ సందర్బంగా విజయ్ గోయల్ మాట్లాడుతూ..  ఫైన్ కట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఆప్ ఎన్నికల జిమ్ముల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఢిల్లీ పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు పంటల వ్యర్థాలను తగులబెట్టటం వల్లనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని ఆప్ నాయకులు అన్నారనీ..మరి  ఈసరి-బేసి వాహనాల విధానాలు ఎందుకు? దీని వల్ల ప్రజలకు ఉపయోగమేంటి? అని ప్రశ్నించారు. 

కాగా..ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రించటానికి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి వాహన విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నవంబర్ 4 ఉదయం నుంచి ఈ అమలులో భాగంగా..సరి-బేసి వాహన విధానం నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.4వేలు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. 

ఈ నిబంధనకు ఆదివారాన్ని మినహాయించారు. అలాగే టూ వీలర్స్ ను కూడా మినహాయించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రాల సీఎంల వాహానాలకు ఈ సరి-బేసి నిబంధనలో మినహాయింపునిచ్చారు.  

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మంత్రులు, అధికారుల వాహనాలకు మాత్రం ఈ సరి-బేసి వాహన విధానం నిబంధన వర్తిస్తుంది. సరి-బేసి విధానం ముగిసే వరూ క్యాబ్ డ్రైవర్లు చార్జీలు పెంచవద్దని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ విధానం పర్యవేక్షణ కోసం ప్రభుత్వం 200 ట్రాఫిక్ పోలీస్ టీమ్ లను ఏర్పాటు చేసింది.

Related Posts