రామ జన్మభూమి పూజ వేళ..అద్వానీ భావోద్వేగ వీడియో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి వెళ్లాలని కోరిక ఉన్న..వెళ్లలేకున్నానని..బీజేపీ సీనియర్ నేత అద్వానీ వెల్లడించారు. దీనికి సంబంధించి..ఓ భావోద్వేగ వీడియో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.భారతావనిలో ప్రతి హిందువు కల ఇప్పుడు నెరవేరబోతోందని, ఇది ఒక చారిత్రక సమయంగా ఆయన అభివర్ణించారు. కరోన సమయం కావడం..వయస్సు రీత్యా..ఆయన భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ట్రస్టు సభ్యులు వెల్లడించారు.

92 సంవత్సరాల వయస్సులో తన మనస్సుకి ఇప్పుడు సంతోషంగా ఉందని, రామ మందిర నిర్మాణ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నోటమాట రావడం లేదని, రామాలయం నిర్మాణ కోరిక హిందువుల్లోకి బలంగా వెళ్లిందన్నారు.దీనికి ఇప్పుడు వస్తున్న స్పందనే కారణమన్నారు. ఏదైనా పని జరగాలంటే..చాలా సమయం పడుతుందని, ఇందుకు రామాలయమే ఉదాహరణ అన్నారు.

రామ మందిర నిర్మాణం ఉద్యమంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. 1980 చివరి నుంచి 1990 వరకు రామ్ రథ యాత్ర పేరిట సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్రను చేపట్టారు. మందిర నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేశారు.
Related Posts