bjp-state-president-bandi-sanjay-fires-over-cm-kcr1

సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది : బండి సంజయ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bandi Sanjay fire CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం (నవంబర్ 19, 2020) హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్.. ఎంఐఎంకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.


గ్రేటర్ ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీ-జనసేన పొత్తు?


తెలంగాణ పోలీసుల్ని చెప్పుచేతుల్లో పెట్టుకున్నారని..వారికి పూర్తి అధికారం ఇవ్వట్లేదన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోకు వెబ్ సైట్ నుంచి తీసేశారని పేర్కొన్నారు. రేపటి నుంచి కేసీఆర్ చరిత్ర బయటపెడతామన్నారు.ప్రధాని మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు దారుణమన్నారు. ప్రధానిని విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన ఘనత బీజేపీదేనని చెప్పారు.

Related Tags :

Related Posts :