దిలీప్ ఘోష్ కాన్వాయ్ పై దాడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Dilip Ghosh’s convoy attacked : పశ్చిమబెంగాల్ లో మళ్లీ టీఎంసీ, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. టీఎంసీ కార్యకర్తలు, నేతలు పద్ధతి మార్చుకోకపోతే…చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోతాయని తీవ్రంగా హెచ్చరించిన వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై దాడి జరగడం కలకలం రేపుతోంది.రాళ్ల దాడికి పాల్పడడంతో ఘోష్, ఎమ్మెల్యే విల్సన్ చంపామారి ప్రయాణిస్తున్న కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడింది ఎవరో తెలియరాలేదు. నిరసన కారులు నల్ల జెండాలు చూపుతూ..గో బ్యాక్, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మదారిహాట్ నియోజకవర్గంలో ప్రచారం ముగించుకుని తిరిగి వెళుతుండగా..ఈ ఘటన చోటు చేసుకుంది. జేజేఎంఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ), గూర్ఖా జన్ ముక్తి మోర్చా (బీజేఎం) దాడికి పాల్పడ్డారని కాషాయ దళం వెల్లడిస్తోంది. ఈ ఆరోపణలను టీఎంసీ, బీజేఎం ఖండించాయి. బైక్ ర్యాలీకి బీజేపీ అనుమతి కోరలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. 25 బైక్ లతో ర్యాలీని నిర్వహించడానికి బీజేపీకి అనుమతి ఉందని, అయితే..వారు 100కి పైగా బైక్ లతో ర్యాలీ నిర్వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీంతో ర్యాలీని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని సమాచారం. ర్యాలీ Jaigaon’s GST Mor చేరుకున్న తర్వాత..కొంతమంది ముసుగులు ధరించిన వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దిలీప్ ఘోష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల చేరుకొనేలోపే..హింసాత్మకంగా మారింది.

Related Tags :

Related Posts :