లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

గ్రహాంతరవాసిలా ఆకారం..ఇప్పుడు మాట్లాడానికి కష్టపడుతున్నాడు

Published

on

black alien, now struggles to speak : ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటుంటారు. కానీ..ఇదే వారిని సమస్యలోకి నెడుతుంటుంది. కొంతమంది శరీరాకృతిని మార్చేసుకుంటుంటే..మరికొందరు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. శరీరం మొత్తం పచ్చబొట్లు వేయించుకుంటుంటారు. ఇలాగే ఓ వ్యక్తి గ్రహాంతరవాసిలా మారాలని అనుకుని..ఆ విధంగా..శరీరాకృతిని మార్చేసుకున్నాడు. ఇందుకు ఆపరేషన్ లు సైతం చేయించుకున్నాడు. కానీ..ప్రస్తుతం..ఇతను మాట్లడానికి చాలా కష్టపడుతున్నాడు.

32 ఏళ్ల Anthony Loffredo కు ఓ కోరిక ఉండేది. నల్లగా గ్రహాంతరవాసిలాగా కనిపించాలని. చర్మాన్ని పూర్తిగా తొలగించి..మెటల్ తో వేయించుకున్నాడు. శరీరమంతా..పచ్చబొట్లు వేయించుకున్నాడు. నాలుక, ముఖం మీద మార్పులు చేసుకున్నాడు. ముక్కు, పై పెదవిని కాస్త తొలగించుకున్నాడు. ఈ కారణంగా..అతని పళ్లు బయటకు వచ్చాయి.

దీంతో అతను మాట్లాడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అతను ఒప్పుకున్నాడు. ఇతనికి ఇన్ స్ట్రా గ్రామ్ లో 2, 27, 000 మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. తన విధానాలు, ఇతరత్రా విషయాలను అందులో పంచుకొనేవాడు.