‘Body in zombie mode,’: India wicket-keeper Dinesh Karthik wishes to resume training

‘జోంబీ మోడ్’లో ఉన్నా.. ఫిట్ కావాలంటే క్రికెటర్లకు టైమ్ పడుతుంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా క్రికెట్‌పై ప్రభావం గట్టిగానే పడింది. లాక్‌డౌన్ కారణంగా ఆటగాళ్లు ఆడే పరిస్థితిలో ప్రస్తుతం లేరని, టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌ చెప్పారు. మ్యాచ్‌లకి సిద్ధం కావటానికి నాలుగు వారాల సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు దినేష్ కార్తీక్. కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో భారతదేశంలో క్రీడా కార్యకలాపాలు మార్చిలో నిలిచిపోగా.. క్రీడా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. 

ప్రభుత్వాల నుండి గ్రీన్ లైట్ కోసం వేచి చూస్తుండగా.. శిక్షణ ప్రారంభించడానికి అనుమతి పొందిన తర్వాత దినేష్ కార్తీక్ తాను ఎదుర్కొనే సవాళ్ళ గురించి మాట్లాడారు. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత క్రికెటర్లు మైదానంలోకి తిరిగి రావడం అంత సులభం కాదని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. క్రికెటర్లు పరివర్తనం చాలా కఠినంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. తనను తాను తిరిగి ట్రాక్ చేయడానికి కనీసం నాలుగు వారాలు అవసరమని సూచించాడు.

లాక్‌డౌన్ సమయంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల తన శరీరం ‘జోంబీ మోడ్’లో ఉన్నట్లు అనిపిస్తుందని దినేష్ కార్తీక్ వెల్లడించారు. వెటరన్ బ్యాట్స్ మాన్ చెన్నై నగరంలో ఆంక్షలు సడలించారని, అవసరమైన అనుమతులు కోరిన తరువాత త్వరలోనే శిక్షణను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తనను తాను నిరూపించుకునే క్షణం కోసం వేచి ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అటువంటి సవాలును ఎదుర్కొనేందుకు తాను చాలా ప్రాక్టీస్ చేస్తున్నానని అన్నారు.

Related Posts