bollywood actor sonu sood wax statue unveiled

సేవలకు సలాం : లోనావాలా మ్యూజియంలో సోనూసూద్ మైనపు విగ్రహం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మానవత్వానికి మారుపేరుగా నిలిచిన సోనూసూద్ కు యావత్ భారతదేశం ఫిదా అయిపోయింది. అటువంటి మానవతామూర్తికి అరుదైన గౌరవం దక్కింది. కష్టంలో ఉన్నవారికి ఆపద్భాంధవుడిలా మారి లాక్ డౌన్ లో వలసకూలీల ఆవేదనకు దన్నుగానిలబడిన సోనూసూద్ భారతీయుల మనస్సుల్లో సుసిస్థిత స్థానాన్ని సంపాదించుకున్న సోనూసూద్ కు ఆత్మీయ గౌరవం దక్కింది. 

ముంబాయిలోని లోనావాలాలో ఉన్న ఓ మ్యూజియంలో సోనూ సూద్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు పోటీగా ప్రముఖ శిల్పి సునీల్ కందలూర్, పూనాకు సమీపంలోని లోనావాలాలో 2010లో ఏర్పాటు చేసిన మైనపు విగ్రహాల మ్యూజియంలో సోనూ సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మైనపు మ్యూజియంలో జాతీయంగా, అంతర్జాతీయంగా మొత్తంగా 100 వరకు సెలబ్రిటీల మైనపు విగ్రహాలున్నాయి. అందులో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహం కూడా ఉండడం గమనార్హం. ఎటువంటి స్వార్థం లేకుండా సొంత డబ్బులతో పేదలకు సేవలు చేసిన సోనుసూద్ కు అటువంటి అరుదైన గౌరవాన్ని ఇచ్చి ఆ మ్యూజియమే గౌరవాన్ని దక్కించుకుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.  

సోనూసూద్ అంటే వలస కూలీల దేవుడిగానే గుర్తుకొస్తారు.కష్టంలో ఉన్నవారికి ఆపద్భాంధవుడిలా మారి..లాక్‌డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో చిక్కుకుని ఉపాధికి నోచుకోక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను నటుడు సోనూ సూద్ సొంత డబ్బులతో ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు చేసిన సంగతి తెల్సిందే.

దీంతో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూ సూద్ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యారు. ఆయన మానవత్వానికి యావత్ భారతదేశం ఫిదా అయింది. ఆయను పొగుడుతూ ఎందరో నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరైతే సోనూ సూద్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఈక్రమంలో ముంబాయిలోని లోనావాలాలో ఉన్న ఓ మ్యూజియంలో సోనూ సూద్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయటంతో ఆయన అభిమానులతో పాటు యావత్ భారతం సంతోషం వ్యకం చేస్తోంది.

Read: బొమ్మ ఆడట్లేదు.. బువ్వ లేదు.. వంద రోజులు..

Related Tags :

Related Posts :