bollywood-actress-kangana-ranauts-mother-asha-ranaut-has-claimed-that-her-daughters-life-is-in-danger

‘వారి ఇంట్లో కూతుళ్లు లేరా’?: శివసేనపై కంగనా తల్లి ఆగ్రహం!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ముంబై నగరంలో బాలీవుడ్ నటి కంగనా.. అధికార శివసేన పార్టీకి మధ్య తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ తల్లి ఆశా రనౌత్ కుమార్తెకు మద్దతుగా నిలిచారు. కుమార్తె కంగనాకు సపోర్ట్‌గా ఆమె మాట్లాడుతూ.. శివసేన తన కుమార్తెకు అన్యాయం చేసిందని అభిప్రాయపడ్డారు. దేశంలోని మొత్తం ప్రజలు దీనిని అస్సలు సహించరని ఆమె అన్నారు.




ఆశా రనౌత్ మాట్లాడుతూ.. ‘కంగనా తప్పు చేసి ఉంటే దేశ ప్రజలు ఆమెతో ఉండేవారు కాదని అన్నారు. ఇది ఎలాంటి ప్రభుత్వం? నా కుమార్తెకి చాలా అన్యాయం జరిగింది. ఇది బాల్ ఠాక్రే శివసేన కాదు. ఈ శివసేన పిరికిది. తమ కుమార్తె పట్ల మహారాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. యావత్‌ దేశం తమ కుమార్తె వెంట ఉందని, ప్రజల ఆశీస్సులు తనకు ఉంటాయని అన్నారు. సత్యం వెంట నిలిచే తన కుమార్తెను చూసి గర్విస్తున్నానని అన్నారు. కంగనాది అక్రమ కట్టడం అంటూ ఆమె కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చడం​ కలకలం రేపగా.. వివాదం తీవ్రతరం అయ్యింది.

శివసేన “సోనియా సేన”గా మారిపోయింది….కంగనా తీవ్ర వ్యాఖ్యలు


తన కుమార్తె ప్రాణానికి ముప్పు ఉందని, ఈ అన్యాయం ఎందుకు? ఇది బాల్ ఠాక్రే శివసేన కాదు. ఇప్పుడు ఉన్న శివసేన పిరికిది అని ఆమె అన్నారు. “ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో పనులు ఎలా జరుగుతున్నాయో భారతదేశం చూస్తోంది.” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.




కంగనాపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆశా రనౌత్ ఇలా అన్నారు: “కంగనా నా కుమార్తె. అతను ఆమె గురించి ఎలా మాట్లాడగలడు? కంగనా ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఒక ఆడపిల్లపై దాడి చెయ్యడం సరికాదని, అలా చేయవద్దని శివసేనకు విజ్ఞప్తి చేశారు.


Related Posts