బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రకుల్ డ్రగ్స్ తీసుకున్నారా? ఎవరెవరి పేర్లు చెబుతారు? బాలీవుడ్ నటుల్లో టెన్షన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) విచారణలో ఎవరెవరి పేర్లు వెల్లడిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్ లింక్స్‌లో రకుల్ పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రగ్స్‌తో మొదటి నుంచి తనకు సంబంధం లేదంటూనే చెబుతూ వస్తోంది రకుల్. రియా విచారణ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పేరు రకుల్. అప్పటి నుంచి ఆమె అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది.

మీడియాలో తన పేరు ప్రస్తావిస్తుండడంతో కోర్టు మెట్లెక్కింది. తన పేరును తీసుకురావొద్దని న్యాయస్థానాన్ని వేడుకుంది. ఈ క్రమంలోనే రియా వెల్లడించిన పేర్లలో రకుల్ పేరు కూడా ఉండడంతో ఎన్సీబీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.

సమన్లు అందలేదు అంది, ఇంతలోనే మాట మార్చింది:
ఇవాళ(సెప్టెంబర్ 24,2020) ఉదయం ఎన్సీబీ ఎదుట హాజరుకావాల్సిన రకుల్‌.. ముందుగా తనకు ఎన్సీబీ నుంచి ఎలాంటి సమన్లు అందలేదని బుకాయించింది. ఎన్సీబీ అధికారులు వెంటనే స్పందించి.. సమన్లు పంపించామని క్లారిటీ ఇచ్చారు.

అంతేకాదు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ ఇస్తామని చెప్పడంతో రకుల్ మాటమార్చింది. నోటీసులు అందాయని వెల్లడించింది. రేపు(సెప్టెంబర్ 25,2020) ఎన్సీబీ విచారణకు హాజరవుతానని ప్రకటించింది. సమన్ల సస్పెన్స్‌కి తెరపడడంతో.. రేపు రకుల్ విచారణలో ఏమేం చెబుతారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

రకుల్ డ్రగ్స్ తీసుకున్నారా..?
రేపటి ఎన్సీబీ విచారణలో ప్రధానంగా రకుల్ డ్రగ్స్ తీసుకున్నారా..? ఒకవేళ తీసుకుంటే అది ఎప్పటి నుంచి మొదలైంది.. ఎవరెవరు తీసుకునేవాళ్లు.. ప్రముఖుల డెన్‌లలో జరిగే డ్రగ్ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యేవాళ్లు.. బాలీవుడ్‌కి చెందిన వాళ్లే పార్టీలకు వచ్చేవాళ్లా.. లేదంటే ఇతర రంగాలకు చెందిన వాళ్లు కూడా పార్టీలకు వచ్చేవాళ్లా.. ఇలా వేర్వేరు కోణాల్లో రకుల్‌ను విచారించనున్నారు.

అలాగే రియా వెల్లడించిన పేర్లను కూడా రకుల్ ఎదుట ప్రస్తావించే అవకాశముంది. రకుల్ విచారణలో కొత్త కోణాలు, మరికొందరి పేర్లు బయటపడతాయని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు.

బాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసు హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ మెడకు చుట్టుకుందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. NCB విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరును రియా బయట పెట్టినప్పట్నుంచీ దుమారం లేపుతూనే ఉంది. మొదట్లో దీనిపై రకుల్ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎన్సీబీ విచారణకు హాజరుకానుండడంతో బాలీవుడ్ నటుల్లో అలజడి మొదలైంది.

ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో:
రకుల్ ఇంటరాగేషన్‌లో డ్రంగ్‌ లింక్‌లు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. డ్రగ్ ఎప్పటి నుంచి అలవాటు.. బాలీవుడ్‌లో డ్రగ్‌ పార్టీలు.. ఏయే నటులు డ్రగ్‌ తీసుకునేవాళ్లు.. సుశాంత్ డెన్‌లో డ్రగ్‌ పార్టీలకు ఎవరెవరు అటెండ్ అయ్యేవాళ్లు.. అసలు వీళ్లందరికి డ్రగ్స్ సప్లయ్ చేసేదెవరు.. హీరోయిన్లతో డ్రగ్ పెడ్లర్లకు ఎలాంటి సంబంధాలున్నాయనే కోణంలో ఎన్సీబీ అధికారులు విచారించనున్నారు. రియా విచారణలో రకుల్, దీపికా, సారా అలీఖాన్‌, శ్రద్దా కపూర్‌లు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇఫ్పుడు రకుల్ విచారణలో ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

READ  చెలి చెంతనుంటే చలి పెరగాలి

Related Posts