బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు.. NCB చేతిలో 50మంది పేర్లు.. వారిలో నటులు, దర్శకులు.. విచారణకు రానున్న రకుల్, దీపికా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్‌లో డ్రగ్స్‌… ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు డ్రగ్స్‌ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఎన్సీబీ చేతిలో 50 మంది జాబితా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు(సెప్టెంబర్ 25,2020) విచారణకు రకుల్‌ ప్రీత్ సింగ్‌, దీపికా పడుకోన్‌ హాజరుకానున్నారు. ఎల్లుండి(సెప్టెంబర్ 26,2020) సారా అలీఖాన్‌ విచారణకు రానున్నారు. గోవా షూటింగ్‌లో ఉన్న దీపికా, సారా అలీఖాన్‌ ముంబై బయలుదేరారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై ఎన్సీబీ అధికారులు ప్రస్తుతం ముమ్మర విచారణ జరుపుతున్నారు. తాజాగా మరికొంత మంది పేర్లు బయటికి రావడంతో దర్యాప్తును విస్తృతం చేసి ముంబై సినీ పరిశ్రమలోని కొందరు ‘‘ఎ-లిస్ట్’’ సెలబ్రిటీలను ‘‘విచారణకు రావాలంటూ కోరినట్టు’’ ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా రకుల్, సారా అలీఖాన్ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్టు ఎన్‌సీబీ అధికారులు ఇటీవల వెల్లడించారు. విచారణకు రావాల్సిందిగా ఎన్సీబీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో హీరోయిన్లు దీపికా పడుకోన్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించి తమ ముందుకు హాజరుకావాలని ఎన్సీబీ ఆదేశించింది. సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కేసును ఎన్సీబీ లోతుగా విచారిస్తోంది. ఈ కేసులో రియా ఫోన్ చాటింగ్ ఆధారంగా ఎన్సీబీ పలువురికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఈ కేసులో ఇప్పటివరకు ఎన్సీబీ 12 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా రియా చక్రవర్తి పలువురు పేర్లను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తాను సారా అలీ ఖాన్, శ్రద్ధా, రకుల్‌తో కలిసి సుశాంత్‌కు చెందిన లోనావాలా ఫామ్ హౌస్‌లో పార్టీ చేసుకున్నట్టు చెప్పినట్టు కథనాలు వచ్చాయి. మొత్తంగా డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది.

Related Posts