తెలుగు సినిమాలు చేయడానికి తహతహలాడుతున్న బాలీవుడ్ బ్యూటీలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bollywood Heroines: ఇప్పుడు బాలీవుడ్ భామలు టాలీవుడ్‌కి వలస కడుతున్నారనే వార్తలు ఫిలిమ్‌నగర్లో వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలుగా తెలుగు సినిమాలు తెరకెక్కుతూ బహు భాషల్లో విడుదల అవుతుండటంతో, తమ అవకాశాలను పెంచుకునే దిశగా తెలుగు తెరవైపు అడుగులు వేస్తున్నట్లు సినిమా పరిశ్రమ వర్గీయుల్లో వినిపిస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే.. తెలుగు సినిమాలకి జాతీయ స్థాయిలో డిమాండ్ ఎక్కువైంది. దీంతో బాలీవుడ్ భామలు తెలుగులో మూవీస్ చేయడానికే తమ డేట్స్ ఎక్కువగా ఇస్తున్నారట. అంతే కాదు పెర్ఫార్మెన్స్‌లోనూ, అందంలోనూ కూడా పోటీ పడుతున్నారు. తెలుగు సినిమాలో నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు బాలీవుడ్ భామలు. విజయ్ దేవరకొండ-పూరీ కాంబోలో తెరకెక్కకుతోన్న ‘పైటర్’(వర్కింగ్ టైటిల్) లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.


పాన్ ఇండియా లెవల్లో వస్తోన్న తెలుగు సినిమాల్లో ఖచ్చితంగా బాలీవుడ్ భామలే కనిపించబోతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీలే ఫిక్స్ అవుతున్నారు. నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దీపికా నటించబోతోంది. అంతకు ముందు కూడా దీపికా సౌత్ సినిమాల్లో అందులోనూ తెలుగు సినిమాలో నటించాలని ఉంది అన్నారు.


ఈసారి ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ భామను రంగంలోకి దించాలని ప్లాన్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాలో హిందీ హీరోయిన్ కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. ట్రిపుల్ ఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను ఫిక్స్ చేయాలని చూస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఈ సినిమాకు ‘‘అయినను పోయిరావలెను హస్తినకు’’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు సమాచారం.


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సెలెక్ట్ చేశారు. గతంలో ఈమె స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రభాస్ “సాహో” సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది. అయితే పూర్తి స్థాయి నటన చూపించడానికి దక్కిన మొదటి అవకాశం మాత్రం పవన్ సినిమానే. ఇక బన్నీ-సుకుమార్ ‘‘పుష్ప’’ మూవీలో శ్రద్ధా కపూర్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అంతా టాలీవుడ్ కథలపైపు ఎట్రాక్ట్ అవుతున్నారు.


Related Posts