లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బాలీవుడ్ రిలీజ్ క్లాష్..

Published

on

Bollywood – Tollywood: సల్మాన్ ఖాన్‌తో పోటీ పడతున్న జాన్ అబ్రహాం, ట్రిపుల్ ఆర్ మూవీని ఢీ కొడతానంటున్న అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్‌తో అమీ తుమీ తేల్చుకోబోతున్న షాహిద్ కపూర్.. ఇంతకీ వీళ్ల మధ్య గొడవెందుకో, ఏంటో డీటెయిల్డ్‌గా చూద్దాం..

2020 లో మిస్ అయిన సినిమాలన్నీ 2021 లో వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఫెస్టివల్స్ దగ్గరనుంచి వీకెండ్స్ అన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. అందరూ ఒకే డేట్స్ ఫిక్స్ చేసుకోవడంతో ఎప్పుడూ లేనంతగా బాలీవుడ్ రిలీజ్ క్లాష్ ఫేస్ చెయ్యబోతోంది.

Radhe

ప్రతి సంవత్సరం ఈద్‌కి కంపల్సరీగా సినిమా రిలీజ్ చేసే సల్మాన్ లాస్ట్ ఇయర్ కోవిడ్ కారణంగా మిస్ అయ్యారు. అందుకే ఈ సంవత్సరం ‘రాధే’ తో రాబోతున్నారు. కరెక్ట్‌గా అదే రోజు జాన్ అబ్రహాం యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సత్యమేవ జయతే 2’ రిలీజ్ అవుతోంది.

Satyameva Jayate 2

మే 28 సమ్మర్ సీజన్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ సినిమా రిలీజ్ కానుంది. అక్షయ్ రా ఏజెంట్ రోల్‌లో కనిపిస్తున్నారు. అదే రోజు హాలీవుడ్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ కూడా రిలీజ్ అవుతోంది. విన్ డీజిల్ , జాన్ సీనా లీడ్ రోల్స్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ని పలకరిస్తూ.. ఇండియాలో అక్షయ్‌తో క్లాష్ అవుతోంది.

Fast & Furious 9

డేట్స్ క్లాష్ అవుతున్న మరో రెండు సినమాలు ‘షేర్‌షా’ – ‘మేజర్’.. విష్ను వర్ధన్ డైరెక్షన్లో కార్గిల్ వార్ హీరో విక్రమ్ బాత్రా రియల్ లైఫ్ స్టోరీగా వస్తున్న ‘షేర్‌షా’ జులై 2 న రిలీజ్ అవుతుంటే.. అదే రోజు ముంబై పేలుళ్లలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా అడవి శేష్ హీరోగా వస్తున్న ‘మేజర్’ కూడా జులై 2 నే రిలీజ్ అవుతోంది.

Shershaah

Major

బాలీవుడ్‌లో అతి పెద్ద క్లాష్.. ‘ఆర్ఆర్ఆర్’ వర్సెస్ ‘మైదాన్’.. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లీడ్ రోల్స్‌లో ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్ లాంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. రాజమౌళి డైరెక్షనలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా సీజన్‌లో అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది.

RRR

అదే సీజన్‌లో అక్టోబర్ 15న రిలీజ్ అవుతోంది అజయ్ దేవ్‌గన్ హీరోగా వస్తున్న ‘మైదాన్’ మూవీ. ఆల్రెడీ ఈ రెండు సినిమాల క్లాష్ బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి.

Maidaan

ఇక ఈ సంవత్సరంలో లాస్ట్ సీజన్ అయిన దీపావళికి కూడా క్లాష్ తప్పడం లేదు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ‘పృథ్విరాజ్’ సినిమాని అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం దీపావళికి పోస్ట్ పోన్ చేశారు. అయితే షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘జెర్సీ’ సినిమాని ఈ సంవత్సరం దీపావళి సీజన్‌లోనే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి ఈ బాలీవుడ్ మూవీ రిలీజ్ క్లాష్‌లో ఏ హీరో తన సత్తా చాటుతాడో తెలియాలంటే వెయిట్ చెయ్యాల్సిందే.

Jersey