bollywood-star-sonu-sood-can-attend-bihar-wedding-accepts-nehas-invitation1

ట్విట్టర్‌లో పెళ్లికి రావాలని కోరిన అమ్మాయి.. అంగీకరించిన సోనూసూద్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sonu Sood: సహాయం అనగానే సోనూసూద్ గుర్తొచ్చేంతలా లాక్‌డౌన్‌లో మెస్సయ్యగా మారిపోయారు. అడిగినవారికి కాదనకుండా సాయం చేసిన సోనూసూద్‌కు లేటెస్ట్‌గా ట్విట్టర్‌లో పెళ్లికి ఓ ఆహ్వానం అందింది. బీహార్‌కు చెందిన నేహా అనే అమ్మాయి సోను సూద్‌ను వివాహనికి ఆహ్వానించగా.. పెళ్లికి వస్తానంటూ ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.



ఈ ఆహ్వాన లేఖను బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని నవాడా ప్రాంతానికి చెందిన కర్మన్ తోలాలో నివసిస్తున్న నేహా సహై పంపారు. నేహా సోదరి దివ్యకు కడుపు నొప్పి శస్త్రచికిత్స చేయించేందుకు సోనూ సహాయం చేశారు. వలస కూలీలు మరియు కార్మికులకు సహాయం చేసిన నటుడు సోను సూద్.. లాక్‌డౌన్ సమయంలో బీహార్ నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాలలో నుంచి సురక్షితంగా వారి స్వగ్రామాలకు పంపించారు. ఈ విషయంలో సోనూ అనేకమంది ప్రశంసలు పొందారు. ఆ సమయంలోనే సోనూసూద్ నేహా సోదరికి ఎయిమ్స్‌లో ఆపరేషన్ చేయించారు.


అంధురాలిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్లో నయనతార.. ‘నెట్రికన్’ టీజర్ చూశారా!


ఈ క్రమంలోనే సోను సూద్‌కు ట్విట్టర్‌లో ఒక వివాహానికి రావాలని ఆహ్వానం పంపారు నేహా. సోనుసూద్ పెళ్లికి వెళ్ళడానికి అంగీకరించారు. “క్షమించండి సర్.. ఎక్సైట్మెంట్‌లో మీ పేరు రాయడం నేను మరచిపోయాను. మీరు పెళ్లికి వస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను మీ కోసం వేచి ఉంటాను” అని సోను సూద్‌ను ట్యాగ్ చేస్తూ నేహా ట్వీట్‌ చేశారు. నేహా ట్వీట్‌పై సోను సూద్ స్పందించారు. “బీహార్ పెళ్లి చూద్దాం” అంటూ సమాధానం ఇచ్చారు.

Related Tags :

Related Posts :