లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

స్టార్ వైఫ్స్.. సిరీస్‌లో చెలరేగిపోయారు..

Published

on

Fabulous Lives of Bollywood Wives: ఏ సినిమా ఇండస్ట్రీ అయినా పలానా హీరో అలా చేస్తారు.. ఇలా ఉంటారు, ఇది తింటారు, ఇక్కడ షాపింగ్‌కి వెళతారు అంటూ ప్రతీదీ హైలెట్ చేస్తారు. ఈ సోకాల్డ్ హీరోల వైఫ్స్ ఎలా ఉంటారో అన్నది కూడా ఈ మద్య కాలంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది. ఈ లైన్‌ని బేస్ చేసుకుని కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘బాలీవుడ్ వైఫ్స్’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

బాలీవుడ్‌లో హీరోలతో పాటు హీరోల భార్యలు కూడా ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంటూనే ఉంటారు. వీళ్లని ఆఫ్ స్క్రీన్ చూడడమే కానీ యాక్టింగ్ చేస్తూ.. చూసింది లేదు పెద్దగా. అయితే ఈ స్టార్ వైఫ్స్ చేత ఏకంగా సిరీస్ చేయిస్తున్నారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.

ధర్మ ప్రొడక్షన్స్‌లో తెరెకెక్కిన ఈ Fabulous Lives of Bollywood Wives (ఫ్యాబులస్‌ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్) ఓటీటీలో రిలీజ్ అయినప్పటి నుంచి హాట్ టాపిక్ అయ్యింది.
రియాలిటీ షో లాంటి ఈ సిరీస్‌లో సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్‌ భార్య సీమా ఖాన్‌, అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్, చుంకీ పాండే వైఫ్ భావనా పాండే, సమీర్ సోనీ భార్య నీలమ్ కొఠారి సోనీ నటించారు.

Fabulous Lives of Bollywood Wives

బాలీవుడ్ స్టార్ వైఫ్స్‌గా ఉండడటం అంత ఈజీ కాదు అనే డైలాగ్స్‌‌తో పాటు కొన్ని సీన్స్‌తో షో స్టార్ట్ అయిన దగ్గరి నుంచి ప్రతి ఎపిసోడ్‌లో ట్రోల్‌కు గురవుతున్నారు యాక్టర్స్. ఇప్పటి వరకూ టెలికాస్ట్ అయిన 4 ఎపిసోడ్స్‌లో ఈ స్టార్ వైఫ్స్ లైఫ్ స్టైల్, మేకప్, డ్రెస్సింగ్.. వీటన్నింటి మీద హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.

పెద్దగా కాన్సెప్ట్ లేకపోయినా.. ఆన్ స్క్రీన్ ఈ స్టార్ వైఫ్స్ యాక్టింగ్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్.  షో స్టార్ట్ అయిన దగ్గరినుంచి సోహైల్ ఖాన్, సీమా ఖాన్ విడిపోయారనేలా చూపించిన కాన్సెప్ట్, బాలీవుడ్ స్టార్ వైఫ్స్‌లో ఎవరు మీ ఫేవరెట్ వైఫ్ అనే ప్రశ్నకు.. కరణ్ జోహార్ అంటూ ట్రోల్స్.. ఇలా చాలా విషయాల్లో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది ఈ ‘ఫ్యాబులస్ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’.