లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

బాలీవుడ్ సెలబ్రిటీస్ – వాలెంటైన్స్ డే టిక్‌టాక్ జోష్

షూటింగ్స్‌తో బిజీగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ ప్రేమికుల రోజుని టిక్ టాక్‌తో వెరైటీగా జరుపుకున్నారు..

Published

on

Bollywood Stars Celebrating Valentine’s Day 2020 on TikTok

షూటింగ్స్‌తో బిజీగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ ప్రేమికుల రోజుని టిక్ టాక్‌తో వెరైటీగా జరుపుకున్నారు..

‘ప్రేమ’.. రెండక్షరాల మాటే కానీ.. మనసుల్ని, మనుషుల్ని నడిపిస్తుంది. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్.. లవ్ లేనిదే లైఫ్ ఎక్కడుంది? అందుకే ప్రేమకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అందరూ. రిలేషన్ షిప్‌లో కంటిన్యూ అవ్వాలన్నా.. లైఫ్‌లో గెటాన్ అవ్వాలన్నా.. అన్నింటికీ కావల్సింది ప్రేమే. అందుకే సినిమాలకు ఆ ప్రేమే ఇంట్రెస్టింగ్ లైన్ అయింది.

ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్ అయింది. రీల్ లైఫ్‌లో ప్రేమ ఒలకబోసే స్టార్స్ రియల్ లైఫ్‌లో ప్రేమలో పడడం, ప్రేమించిన వారితో ఏడడుగులు వేయడం మనం చూశాం. షూటింగ్స్‌తో బిజీగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ ప్రేమికుల రోజుని టిక్ టాక్‌తో వెరైటీగా జరుపుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకొణె, శిల్పా శెట్టి, మాధురి దీక్షిత్, రితేష్ దేశ్‌ముఖ్ బాలీవుడ్ స్టార్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా టిక్ టాక్ వీడియోలు చేశారు. 

దీపికా పదుకొణె
దీపికా తను నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ సినిమాలో తనకిష్టమైన డైలాగ్ చెబుతూ.. ఇది తనకెంత ఇష్టమైన డైలాగ్ అని, అందరికీ ప్రేమికులరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మనం ప్రతిరోజునీ ఇలాగే సెలబ్రేట్ చేసుకుందాం.. అని తెలిపింది.

@deepikapadukone

Throwback to one of my most iconic dialogues…Happy Love Day everyone and may we celebrate everyday like today…❤

♬ original sound – deepikapadukone

శిల్పా శెట్టి
సీనియర్ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి వాలెంటైన్ వీడియో చేసింది. బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుండగా.. తనను క్షమించమంటూ భర్తని వేడుకోవడం.. తను రోజ్ ఇవ్వడం.. హ్యాపీగా ఫీలవుతూ హగ్ చేసుకోవడం.. ఇలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో శిల్వా చేసిన టిక్ టాక్ వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్ రావడం విశేషం.

@theshilpashetty

Dil ko jodo.. todo mat .❤️? My valentine forever therajkundra #valentinesday2020 #love #pyar #fyp #trending

♬ Teri Ban Jaungi Reprise Tulsi Kumar Version 2 – Tulsi Kumar

మాధురీ దీక్షిత్ 
బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరోయిన్.. కుర్రాళ్ల కలలరాణి మాధురీ దీక్షిత్ వాలెంటైన్స్ డే వీడియోతో మరోమారు కుర్రాళ్లను కవ్వించింది. కపుల్స్‌కి, తోడు కోరుకునే వారికి ఆమె వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.

@madhuridixitnene

Happy Valentines Day! #valentineday2020

♬ original sound – Madhuri Dixit Nene

రితేష్ దేశ్‌ముఖ్ 
రితేష్ కాస్తా వెరైటీగా విషెస్ తెలియచేశాడు.. మనుషులతో కాకుండా రోబోతో ముచ్చటిస్తూ కాస్త విచారంగా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పాడు. బాలీవుడ్ సెలబ్రిటీస్ చేసిన ఈ వాలెంటైన్స్ డే టిక్ టాక్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

@riteishd

#valentinesday

♬ ओरिजिनल साउंड – aartirana0639

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *