బాలీవుడ్ చూపు టాలీవుడ్ వైపు.. హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న తెలుగు సినిమాలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్.. ఇండియన్ సినిమాలో మేజర్ రోల్ ప్లే చేసే ఇండస్ట్రీ.. ఎన్ని సక్సెస్‌లు, ఎన్ని హిట్లు సంపాదిస్తేనే గానీ అక్కడ అవకాశం దక్కించుకోలేరు. అలాంటిది, ఈ మద్య బాలీవుడ్ మన తెలుగు సినిమాలమీద ఫోకస్ పెట్టింది.
కొత్తదనంతో కూడిన తెలుగు సినిమాలు దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటుండడంతో పనికట్టుకుని తెలుగు సినిమాలని రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇప్పటికే టాప్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాల రీమేక్ స్టార్ట్ అవ్వకముందే మరో క్రేజీ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది.

Vinayakudu

అది కూడా అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం సాయి కిరణ్ అడివి డైరెక్ట్ చేసిన ‘వినాయకుడు’ చిత్రం కూడా హిందీలో రీమేక్ కానుంది. బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీగా వచ్చిన ‘వినాయకుడు’తో సాయి కిరణ్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ ఏడాది సంక్రాంతి హిట్‌గా నిలిచిన ‘అల..వైకుంఠపురంలో..’ సినిమా కూడా బాలీవుడ్‌కి వెళుతోంది. ఏక్తాకపూర్, అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ రీమేక్‌లో కార్తీక్ ఆర్యన్ అల్లు అర్జున్ రోల్ చెయ్యబోతున్నాడు.

Ala Vaikunthapurramuloo
నవీన్ పోలిశెట్టి హీరోగా స్వరూప్ డైరెక్షన్‌లో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’.. రూ.4 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ రూ. 20 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సూపర్ హిట్ మూవీ హిందీ రైట్స్ రూ.2 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. త్వరలోనే ఈ సినిమా కూడా స్టార్ట్ అవ్వబోతోంది.

ఇవే కాకుండా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘HIT’ కూడా బాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. రాజ్ కుమార్‌రావు హీరోగా నటించనుండగా తెలుగు వైర్షన్ డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను హిందీలో కూడా దర్శకత్వం వహించనున్నాడు.

Agent Sai Srinivasa Athreya

చూడ్డానికి షార్ట్ ఫిల్మ్‌‌లా క్రిస్పీగా కనిపిస్తుంది..కానీ సిల్వర్ స్క్రీన్ మీద పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది ‘మత్తు వదలరా’ సినిమా.. కీరవాణి కొడుకు సింహా హీరోగా పరిచయం కాగా, రితేష్ రానా డైరెక్షన్లో ఇంట్రస్టింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘మత్తువదలరా’.. మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో కూడా రితేష్ రానానే డైరెక్ట్ చేస్తున్నాడు.

Jersey

నాని లీడ్ రోల్‌ చేసిన ఎమోషనల్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ ‘జెర్సీ’ కూడా హిందీలో రీమేక్ అవుతోంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీని తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్‌లో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అటు బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లో కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. సస్పెన్స్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన ‘టాక్సీవాలా’.. ‘Khaali Peeli’ పేరుతో బాలీవుడ్ రీమేక్‌ అవనుంది. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే జంటగా నటిస్తుండగా మక్బూల్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

READ  జరిగింది ఏంటి..? మీరు తీసింది ఏంటి..? సినిమాను ప్రదర్శంచకండి.. ఆదేశాలు జారీ చేసిన ఎన్‌సీడబ్ల్యూ..

Taxiwala

శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేదా పేతురాజ్, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్రోచేవారెవరురా’ కూడా హిందీ నాట రీమేక్ కానుంది. సన్నీ డియోల్ కొడుకు కరణ్ డియోల్ హీరోగా పరిచయం కానున్నాడు. ఒకప్పుడు మన తెలుగు సినిమాలను చిన్నచూపు చూసే హిందీ పరిశ్రమ ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడంతో మన తెలుగు సినిమా మరింత విస్తరిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మంచి పరిణామం.
త్వరలోనే పలు తెలుగు సినిమాలు బాలీవుడ్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి.

Brochevarevarura

Related Posts