మాస్క్ వాడని షాప్ ఓనర్‌కు ఎట్టకేలకు బెయిల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

MASK: సెషన్స్ కోర్టు ఎట్టకేలకు 20ఏళ్ల కూరగాయలమ్మే వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. లాక్‌డౌన్ సమయంలో పబ్లిక్‌లో తిరుగుతూ మాస్క్ పెట్టుకోకుండా ఉంటున్న వ్యక్తిని.. పోలీసులు పట్టుకున్నారు. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) మాస్క్ లు పెట్టుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆంక్షలు విధించింది.

అక్టోబర్ 31న మాతుంగాలో ఉండే జగదీశ్ అనే వ్యక్తి శివాజీ పార్క్ వద్ద మాస్క్ పెట్టుకోకుండా కూరగాయాలు అమ్ముతున్నాడు. దానిని పనిష్మెంట్ పోలీసులు విధించగా రూ.200 జరిమానా కట్టడానికి అతను ఒప్పుకున్నాడు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులతో వాదనకు దిగాడని అతనిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు.లాయర్ ఆర్ఎఫ్ జైస్వాల్ ను సంప్రదించి బెయిల్ అప్లికేషన్ సబ్‌మిట్ చేశాడు. అతని అరెస్టు కుటుంబంలో ఆర్థిక సమస్యలు తెస్తుందని గోడు వెల్లబోసుకున్నాడు.

‘లాక్‌డౌన్ కారణంగా దిగువ తరగతి కుటుంబాలు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి. పేదరికంతో సతమతమవుతున్న కుటుంబంలోని వ్యక్తి మీద ఎటువంటి క్రిమినల్ నేరారోపణ లేదని’ చెప్పిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Related Tags :

Related Posts :