ఆగష్టు 15కల్లా ఇంటి పట్టాలు ఇచ్చి తీరాలనేదే సీఎం జగన్ కోరిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సీఎం జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసు నుంచి నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన బొత్స సీఎం చేస్తున్న పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు.

సాధారణ ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రమంతా ఇళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన వారందరికీ పాదయాత్ర చేసి ఒక మాట చెప్పారు, అవకాశమిస్తే అధికారంలోకి రాగానే 25 లక్షల ఇళ్ళస్ధలాలు ఇచ్చి మీ అందరినీ ఇంటి యజమానులను చేస్తామన్నారు. చెప్పినట్లుగానే సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే 25 లక్షల ఇళ్ళ స్ధలాలు సేకరించాలని అధికారులకు చెప్పారు.

మాలాంటి కొంతమంది 25 లక్షల మందికి ఒక్కసారి ఇవ్వాలంటే ఇబ్బంది అని చెప్పినా అందరికీ ఒకేసారి ఇవ్వాల్సిందే, మనసుంటే మార్గముంటుందని, ప్రభుత్వ స్ధలాలు సరిపోకపోతే అవసరమైతే స్ధల సేకరణ చేద్దామని ముఖ్యమంత్రి గారు దృఢసంకల్పంతో, దృఢ నిశ్చయంతో మాట చెప్పారు

తదుపరి క్యాబినెట్‌ సమావేశంలో ఈ అంశం పెట్టి ఆమోదించి తర్వాత కలెక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో మాట ప్రకారం ఇళ్ళు లేని తల్లి, చెల్లి, అక్కా ఉండకూడదని చెప్పారు. సుమారు 30 లక్షల మంది అర్హులయ్యారు, వారందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దమైంది

నిజానికి జులై 8 న మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి గారి 71 వ జయంతి నాడు 30 లక్షల మందికి ఇళ్ళపట్టాలు ఇవ్వాలని ఒక లక్ష్యం, దిశగా సుమారు 26,034 ఎకరాలు అవసరముంటే 22వేల 68 ఎకరాలు సేకరించాం, విశాఖలో ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా 4వేల 457 ఎకరాలు సేకరించి మొత్తం 26వేల 34 ఎకరాలు సేకరించి లేఓట్‌లు సిద్దం చేశాం, ఎక్కడికి వెళ్ళినా లేఓట్‌లు వేసిన భూములు ఒక యాత్రలాగా సందడిగా ఉన్నాయి

పురాణాల్లో విన్నాం, చూశాం, లోకకళ్యాణం కోసం మునులు తపస్సు చేస్తుంటే రాక్షసులు ఏ రకంగా భగ్నం చేసే ప్రయత్నం చేశారో చూశాం. ప్రభుత్వం యజ్ఞంలాగా, మంచి కార్యక్రమం తలపెడితే అమ్మని, అక్కచెల్లెమ్మని ఇంటి యజమాని చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు, ఆయన అనుచరులు రాక్షస ప్రవృత్తితో, ఆలోచనలతో కోర్టు నుంచి స్టేలు తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, హైకోర్టులో 4 రిట్‌ పిటీషన్‌లు వేశారు, దీనిపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం అక్కచెల్లెమ్మకి పట్టాలు ఇచ్చి సర్వహక్కులు వారికే ఉంటాయని భావించారు. గత ప్రభుత్వాల మాదిరి డిఫామ్‌ పట్టాలు ఇవ్వచ్చు కానీ అలా కాకుండా వారి పేరు మీదే పట్టాలు రిజిస్టర్‌ చేయాలని నిర్ణయించారు

మొత్తం 29లక్షల 18 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. రాక్షస ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో టీడీపీ ప్రయత్నం చేస్తుంది. టీడీపీ ఎన్ని కుతంత్రాలు, కుట్రలు చేసినా దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని ఆగష్టు 15న న్యాయస్ధానం అనుమతితో చేయాలని అనుకున్నాం

కోవిడ్‌ వల్ల కోర్టులు సెలవుల కారణంగా ఆలస్యం జరుగుతుంది, ఏదేమైనా 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి ఆగస్టు 15న స్వయంగా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడతారు

రెండు మూడు రోజుల నుంచి టీడీపీ నేతల వాదన చూస్తున్నాం. వైఎస్సాఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హౌజింగ్‌ మంత్రిగా చేశాను, అప్పుడు పూరిల్లు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సుమారు 45 లక్షల పైగా ఇళ్ళుకట్టాం. రాజశేఖర్‌రెడ్డి హయాంలో కట్టిన కాలనీలన్నీ కూడా ఇప్పుడు గ్రామాలుగా మారాయి

టీడీపీ హయాంలో మీరిచ్చిన లెక్కల ప్రకారం సుమారు మంజూరు చేసినవి కేవలం 6లక్షల 20వేల ఇళ్ళు మాత్రమే. అన్నీ స్కీమ్స్‌ కలిపి ఇచ్చిందివే. ఇందులో కట్టింది 3లక్షల 50వేలు మాత్రమే.

చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రెండేళ్ళలో ఒక్క ఇంటికైనా శంకుస్ధాపన చేశారా, టిడ్కో ఇళ్ళ గురించి రకరకాలుగా కబుర్లు చెప్పారు, లబ్దిదారుల నుంచి డబ్బు వసూలు చేసి ఒక్క ఇళ్ళైనా లబ్దిదారుడికి ఇచ్చారా అంటే అదీ లేదు

గత ప్రభుత్వంలో హౌజింగ్‌లో సుమారు 4వేల 300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. టిడ్కోలో 70 వేల ఇళ్ళు 90 శాతం కట్టారు. మిగిలినవి చూస్తే అరకొరగా కట్టారు. పేదల రక్తాన్ని ఏ రకంగా పీల్చారో అర్ధమవుతుంది. సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ళు స్ధలాలు ఇస్తుంటే న్యాయస్ధానాలకు వెళ్ళి సాంకేతికంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దుర్మార్గమైన ఆలోచనతో రాక్షస ప్రవృత్తితో ఈ యజ్ఞానికి ఆటంకం సృష్టిస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం ఎవరూ నిరాశ పడద్దు, కానీ దుష్టశక్తుల వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి ఏది ఏమైనా స్వాతంత్ర దినోత్సవం రోజు మీకూ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇళ్ళు వచ్చిందన్న ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తలపెట్టారు. టీడీపీ చేసిన కార్యక్రమం వల్ల కొంత ఆలస్యం జరిగినా మేం స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆగస్టు 15న ఇళ్ళపట్టాలు ఇస్తామని మరోసారి స్పష్టం చేస్తున్నామని బొత్సా స్పష్టం చేశారు.

Related Posts