Published
2 months agoon
Bowenpally Kidnap Case : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియేనని సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయడమే కాకుండా..కీలక ఆధారాలు సేకరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ ఘటనలో ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వాడారని, ఇందులో అఖిలప్రియ కీలక పాత్ర పోషించారని తెలిపారు. కిడ్నాప్ చేయడానికి ముందు..నిందితులు మియాపూర్ లో ఆరు సిమ్ కార్డులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వీటిలో 7095637583 నంబర్ ను అఖిల ప్రియ వాడారని, మల్లిఖార్జున్ రెడ్డి ద్వారా 6 సిమ్ లు, మొబైల్స్ కొనుగోలు చేశారని చెప్పారు.
కిడ్నాప్ చేయకముందు నిందితులు రెక్కీ నిర్వహించారని, భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనులు ప్లాన్ వర్క్ చేశారన్నారు. మొత్తం ఈ కేసులో 19 మంది పాత్ర ఉందని తేల్చడం జరిగిందన్నారు. అఖిల ప్రియ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై సీపీ స్పందించారు. గాంధీ ఆసుపత్రిలో ఆమెకు అన్ని వైద్య పరీక్షలు చేయించినట్లు, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించామన్నారు సీపీ.
హఫీజ్ పేట భూ వివాదంలో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అదే సమయంలో టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి అనుచరులు ఏవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందినట్లు గుర్తించారు.
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 13 వరకు అఖిలప్రియను పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు. అఖిలప్రియ మెడికల్ రిపోర్టును చంచల్ గూడ జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. వైద్య నివేదికల్లో అఖిలప్రియ ఆరోగ్యం నార్మల్గానే ఉందని తేలడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. చంచల్ గూడ జైలులో ఉన్న అఖిలప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
అనుమానాన్ని సాక్ష్యంగా తీసుకోలేం : సుప్రీంకోర్టు
‘ముద్దు’ పెట్టించుకుని కేసు పెట్టకుండా వదిలేసిన పోలీసోడు..!!
ఆమె చేతిపై పచ్చబొట్టు..అత్యాచారం నిందితుడికి బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు : ‘టాటూ వేయటం అంత ఈజీ కాదు‘అన్న ధర్మాసనం
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి డాక్టర్ కిడ్నాప్…రూ.20లక్షలు డిమాండ్
భార్య క్రెడిట్ కార్డుతో ప్రియురాలి ట్రాఫిక్ చలాన్లు కట్టిన భర్త..ఇద్దరి ముందూ భలే బుక్ అయిపోయాడు..
మదనపల్లె ఘటన : జైల్లో శివ..శివా అంటూ అరుస్తున్న పద్మజ