లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : భూమా అఖిల ప్రియ భర్త, గుంటూరు శ్రీను అరెస్టు!

Published

on

Bowenpally kidnapping case : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు ఘటనలో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. కీలకంగా భావిస్తున్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ లీడర్ భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మరో వ్యక్తి గుంటూరు శ్రీనును కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. ఇప్పటికే భూమా అఖిల ప్రియను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కిడ్నాప్ ఘటన జరిగినప్పటి నుంచి భార్గవ రామ్, గుంటూరు శ్రీనుల ఆచూకీ తెలియలేదు. తాజాగా వీరిద్దరినీ అరెస్టు చేయడంతో కేసుకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బోయిన్ పల్లి కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టించింది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 13 వరకు అఖిలప్రియను పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు.

మరోవైపు..అఖిల ప్రియ మూడు రోజుల కస్టడీ విచారణ ముగిసింది. ఈ విచారణలో ఆమె దగ్గరి నుంచి పలు విషయాలను పోలీసులు రాబట్టారు. 300కు పైగా ప్రశ్నలకు సమాధానాలను రాబట్టారు. ఎంజీఎం స్కూల్ లో కిడ్నాపర్లతో భార్గవ రామ్, చంద్రహాస్ భేటీ అయినట్లు, కూకట్ పల్లి హోటల్ లో మాడాల శ్రీనుతో భార్గవ రామ్ భేటీ అయినట్లు నిర్ధారించారు. స్కూల్ లో స్పెషల్ 26 సినిమా చూపెట్టి కిడ్నాప్ కు స్కెచ్ వేసినట్లు, కిడ్నాప్ సమయంలో బోయిన్ పల్లి వరకు భార్గవ రామ్ కారులో వెళ్లినట్లు..అనంతరం మొయినా బాద్ ఫాం హౌస్ కు చేరుకున్నాడని పోలీసులు తేల్చారు. సంజయ్ ప్రవీణ్ లతో డాక్యుమెంట్లపై సంతకాలు చేయించాడని, కిడ్నాప్ తర్వాత..పోలీసుల వేటతో అఖిల ప్రియ ప్లాన్ మార్చారని తేలింది. కిడ్నాప్ చేసిన వారిని వదిలివేయాలని ఆమె చెప్పడంతో..ముగ్గురిని వదిలి..కిడ్నాపర్లు పారిపోయారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *