లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఓటీటీలో ఓకే.. మరి థియేటర్లలో ఎంత వసూలు చేశాయంటే..

Publish Date - 9:06 pm, Wed, 20 January 21

Digital Release Movies: లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఎనిమిది నెలలపాటు థియేటర్లు మూత పడడంతో తమ సినిమాల రిలీజ్ పరిస్థితి ఏంటో తెలియక నిర్మాతలు నానా ఇబ్బంది పడ్డారు. సినిమా హాళ్లు పున:ప్రారంభమయ్యే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఓటీటీలవైపు మొగ్గు చూపారు.

అగ్ర నిర్మాత దిల్ రాజు మొదట తను నిర్మించిన ‘వి’ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేశారు. నేచురల్ స్టార్ నాని నటించిన 25 వ సినిమా కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ థియేటర్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పరిస్థితులు అనూకూలించకపోవడంతో డిజిటల్ రిలీజ్ చేశారు.

తర్వాత రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ సినిమాలు కూడా ఓటీటల ద్వారానే విడుదలయ్యాయి.. థియేటర్లు పున:ప్రారంభమవడంతో ఇటీవల లిమిటెడ్ థియేటర్లలో ఈ మూడు సినిమాలను రిలీజ్ చేశారు. ఈ డిజిటల్ రిలీజ్ మూవీస్ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ (షేర్స్) ఇలా ఉన్నాయి..
‘వి’ రూ. 16 లక్షలు, ‘ఒరేయ్ బుజ్జిగా’ రూ. 24 లక్షలు, ‘డర్టీ హరి’ రూ. 15 లక్షల షేర్ సాధించాయి.