Home » యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానంటూ బెదిరించిన 15ఏళ్ల టీనేజర్
Published
2 months agoon
By
subhnYogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తానంటూ బెదిరించిన 15ఏళ్ల టీనేజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కుటుంబమంతా ఆ టీనేజర్ ఎప్పుడు ఇంటికి వస్తాడోనని ఎదురుచూపుల్లో ఉన్నారు. చిన్నతనంలో చేసిన పొరబాటును క్షమించాలంటూ వేడుకుంటున్నారు.
పోలీసులు ఇంటికి వచ్చి తీసుకెళ్లే సమయంలో తాను లేనని, అది చిన్నతనంగా భావించి వదిలేయాలని 70ఏళ్ల నానమ్మ జువైనల్ కోర్టును వేడుకుంటుంది. ‘అతణ్ని తిరిగి తెచ్చుకోవడానికి లక్నోకు వెళ్లాడు బాలుడి తండ్రి. నా మనువడు సాధారణ వ్యక్తి. అతని చిన్నతనంలోని ప్రవర్తనను క్రిమినల్ చర్యగా ట్రీట్ చేయొద్దని ఆమె వేడుకుంటుంది.
లక్నోలోని సుషాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ ప్రకారం.. టీనేజర్ వాట్సప్ రాష్ట్ర హెల్ప్ లైన్ నెంబర్ 112కు బెదిరింపులు పంపాడు. పోలీసులు ఆ మొబైల్ నెంబర్‌ను సైబర్ సెల్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆగ్రాకు చెందిన బాలుడిగా గుర్తించి అక్కడకు వెళ్లి పట్టుకున్నారు.
గత ఆదివారం అతనికి ఇంటికి వెళ్లిన ఇద్దరు పోలీసులు లక్నోకు తీసుకెళ్లారు. అక్కడే జువైనల్ బోర్డు ముందు హాజరుపరిచారు. జువైనల్ హోమ్ కు తరలించాలా కనిపిస్తున్నారు. ఆ బాలుడు ఓ స్కూల్ టీచర్ కొడుకు.