కర్నూలులో నాటుబాంబు పేలుడులో గాయపడ్డ 7వ తరగతి విద్యార్థి మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

kurnool bomb blast: కర్నూలు జిల్లాలో నాటుబాంబు పేలుడు ఘటనలో గాయపడ్డ బాలుడు మృతి చెందాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూశాడు. నిన్న(నవంబర్ 15,2020) నాటు బాంబు పేలుడులో బాలుడు వరకుమార్ గాయపడ్డాడు. అవుకు మండలం చెన్నంపల్లెలో ఈ ఘటన జరిగింది.

అవుకు మండలం చెన్నంపల్లిలో స్కూల్‌ పక్కన పశువుల పాకలో కొందరు నాటు బాంబులను దాచి ఉంచారు. వాటిని క్రికెట్ బంతులుగా భావించి 7వ తరగతి విద్యార్థి వరకుమార్ తీసుకున్నాడు. ఆ బాంబుతో ఆడుకుంటున్న సమయంలో పేలగా.. కుమార్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అతని రెండు చేతులు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ కుమార్‌ మృతి చెందాడు. నాటు బాంబులకు బలైన కుమారుడి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుమార్ తండ్రి డిమాండ్ చేశాడు. అసలు నాటుబాంబులు ఎవరు పెట్టారు..? ఎందుకోసం ఉంచారు..? ఎక్కడ తయారు చేశారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చెన్నంపల్లి మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్ధసారధి రెడ్డి స్వగ్రామం.

నాటుబాంబుల వ్యవహారం గ్రామంలో కలకలం రేపింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు ఇక లేడంటూ గుండెలు బాదుకుంటున్నారు. తమ పిల్లాడి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, పశువుల పాకలో మొత్తం మూడు నాటు బాంబులు ఉండగా వాటిలో రెండింటిని వరకుమార్ రెండు చేతులతో పట్టుకున్నాడని.. ఈ సమయంలోనే ఆ బాంబులు పేలినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. బాంబులు పేలిన సమయంలో భూమి దద్దరిల్లడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడ్డారు.

చెన్నంపల్లెలో బాంబు స్క్వాడ్ తనిఖీలు:
కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లెలో బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుపుతోంది. పోలీసు జాగిలాలతో నాటు బాంబు పేలుడు జరిగిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నిన్న(నవంబర్ 15,2020) చెన్నంపల్లెలోని పశువుల పాకలో జరిగిన నాటుబాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన 12 ఏళ్ల బాలుడు వరప్రసాద్…ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(నవంబర్ 16,2020) చనిపోయాడు. పేలుడు జరిగిన ప్రాంతంలో మూడు నాటు బాంబులు ఉన్నాయని, రెండు బాంబులను, రెండు చేతులతో కొట్టడంతో పేలుడు జరిగిందని బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. నిన్న క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించగా..ఇవాళ…బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. బాంబు పేలుడుతో చెన్నంపల్లె ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Related Tags :

Related Posts :