లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్‌ కలకలం, రూ.45లక్షలు ఇవ్వాలని డిమాండ్

Published

on

boy-kidnap-in-mahaboobabad-district

boy kidnap: మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేగింది. 45 లక్షలు ఇవ్వాలని లేకుంటే బాబుని చంపేస్తామంటూ తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్‌ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు. తరుచూ ప్రైవేట్‌ నెంబర్లతో ఫోన్లు చేస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలంటూ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రూ.45లక్షలు ఇస్తే వదిలేస్తాం:
జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్థానిక కృష్ణ కాలనీలో నివాసం ఉంటూ.. ఓ ప్రముఖ టీవీ చానల్‌ వీడియో జర్నలిస్టుగా పని చేస్తున్న రంజిత్‌, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎక్కడి వెళ్లాడో తెలియని బాలుడు.. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. బైక్ పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు బాలుడిని తీసుకుపోయారని స్థానికులు తెలిపారు.

రాత్రి 9:45 నిమిషాలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేశారు. రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దన్నారు. బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మీరు ఏం చేస్తున్నా మాకు తెలుస్తుంది, మీ బాబుకు జ్వరంగా ఉండడంతో మాత్రలు కూడా వేశామని చెప్పి దుండగులు ఫోన్ పెట్టేశారు.

ప్రైవేట్ ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్:
దీంతో ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కిడ్నాప్ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. పలువురు అనుమానితులను ప్రశ్నించారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాపర్లు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫోన్ చేసినా.. ప్రైవేట్ ఫోన్‌ నంబర్లతో చేస్తుండడం వల్ల వారి ఆచూకీని కనిపెట్టలేక పోతున్నామని పోలీసులు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *