గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన హాస్యబ్రహ్మ, అడవి శేష్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా సీనియర్ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత బ్ర‌హ్మానందం స్వీకరించారు. అందులో భాగంగా మణికోండలోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు. ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మానందంకు ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు. బ్ర‌హ్మానందంను ఆద‌ర్శంగా తీసుకుని చాలా మంది మొక్క‌లు నాటాల‌ని ఉద‌య‌భాను తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అభినందించారు బ్ర‌హ్మానందం.

అలాగే యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్‌లో యువ హీరో అడవి శేషు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడవి శేషు మాట్లాడుతూ.. ‘‘పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా హీరోయిన్ శోభిత ధూళిపాళ, డైరెక్టర్ శశికిరణ్‌లు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Read: దాసరి ఆస్తుల గొడవ : దాసరి అరుణ్ కుమార్ ఏమన్నారంటే

Related Posts