లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

బ్రహ్మోస్‌, నిర్భయ్,‌ఆకాశ్‌ మిసై​​​​​ళ్లతో… చైనా తోక జాడిస్తే బుద్ది చెప్పేందుకు భారత్ రెడీ

Published

on

Brahmos, Akash and China: తూర్పు లడఖ్ సరిహద్దుల్లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. చైనా ఆర్మీ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా భారత్‌ సిద్ధమైంది. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌కు దీటుగా సమాధానమిచ్చేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులు, ఇతర సామగ్రిని ఇప్పటికే తరలించింది.


కాగా, ఇప్పుడు జిన్‌జియాంగ్‌, టిబెట్‌ ప్రాంతంలో చైనా భారీ స్థాయిలో క్షిపణులు మోహరిస్తోందన్న వార్తల నేపథ్యంలో బ్రహ్మోస్‌, నిర్భయ్,‌, ఆకాశ్‌ వంటి మిసై​​​​​ళ్లతో చైనా తోక జాడిస్తే బుద్ధిచెప్పేందుకు భారత్ రెడీ అయినట్లు సమాచారం. చైనా గనుక హద్దు దాటితే వీటితో పాటుసూపర్‌ సోనిక్‌ నిర్భయ్ ‌ను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. వివాదాస్పద ఆక్సాయ్‌ చిన్‌తో పాటు కష్‌గర్‌, హొటాన్‌, లాసా, నియాంగిచిల్‌ ప్రాంతాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


గాల్లో నుంచి గాల్లోకి, గాల్లో నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలిగే బ్రహ్మోస్‌ 500 కిలోమీటర్లు, 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల నిర్భయ్‌ క్రూయిజ్‌ మిసైల్‌ ద్వారా ప్రత్యర్థి దేశ ఆర్మీ పన్నాగాలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. నిర్భయ్‌ వంటి సూపర్‌సోనిక్‌ మిస్సైళ్లలోని అంతర క్షిపణుల ద్వారా సుమారు 1000 కిలోమీటర్ల పరిధిలో గల లక్ష్యాలను చేరుకునేలా(100 మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరటం సహా టార్గెట్‌ను ఫిక్స్‌ చేసి సమర్థవంతంగా ఛేదించేలా) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇక, ఒకేసారి 64 టార్గెట్లను ట్రాక్‌ చేసి, ఒకేసారి పన్నెండింటిపై విరుచకుపడగలిగే 3-డీ రాజేంద్ర రాడార్‌ కలిగి ఉన్న ఆకాశ్‌ క్షిపణిని ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. యుద్ధ విమానాలు, క్రూయిజ్‌ మిసైళ్లు, బాలిస్టిక్‌ మిసైళ్లను కూడా పేల్చేయగల సామర్థ్యం దీనిసొంతం.
.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *