Brain Dead pregnant women pandant child catherine sequeira portugal

చనిపోయిన 2 నెలకు బిడ్డకు జన్మనిచ్చిన క్రీడాకారిణి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పోర్చుగల్: చనిపోయాక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఓ గర్భిణి. ఒకపక్క మనుమడు పుట్టాడన్న ఆనందం..మరోపక్క కన్న కుమార్తె చనిపోయిందనే విషాదం ఆమె తల్లిదండ్రులు సంతోషించాలో దు:ఖపడాలో తెలియని పరిస్థితికి గురయ్యారు.  
 

కేథరీనా సెకీరా అనే 26 ఏళ్ల అంతర్జాతీయ క్రీడాకారిణి 2018 డిసెంబరులో బ్రెయిన్ డెడ్ అయిన కేథరీనాను ఆసుపత్రిలో చేర్చారు. కానీ అప్పటికే ఆమె 17 వారాల గర్భవతి. ఈ క్రమంలో బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందించాలని కుటుంబసభ్యులు కోరారు. డాక్టర్లు పోర్చుగల్ చట్టం ప్రకారం బిడ్డను అమానుషంగా చంపడం కూడా నేరం. ఈ చట్టాలను అనుసరించి కేథరీనా కుటుంబ సభ్యులు,డాక్టర్లు ఇప్పటివరకూ ఆమెకు వెంటిలేటర్ పైనే చికిత్సనందించారు. 

ఈ క్రమంలో దాదాపు 56 రోజుల పాటు ఆసుపత్రి మంచంపైనే వెంటిలేటర్‌తో కేథరీనాకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆరు నెలలు పూర్తయిన వెంటనే కొన్ని రోజులకు కేథరీనాకు ఆపరేషన్ చేసి  గురువారం (మార్చి 28)న  కేథరీనాకు ఆపరేషన్ చేసి  మగబిడ్డకు బైటకు తీసారు డాక్టర్లు. బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో కేథరీనా కుటుంబసభ్యులు ఆనందపడిన సమయంలోనే ఇక తమ కూమార్తె కళ్లకు కనిపించదని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం జన్మనిచ్చిన బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితి తమ కూతురి దుస్థితికి కుమిలిపోయారు. కాగా మార్చి 29న  కేథరీనా అంత్యక్రియలను నిర్వహించారు. 
 

Related Posts