లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

హైదరాబాద్ లో కోవిడ్ టెస్టులకు బ్రేక్

Published

on

Break to Covi-19 testing temperorly in Hyderabad

హైదరాబాద్ లో కరోనా టెస్టులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 50 వేల టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా పాత శాంపిల్ టెస్టింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతో మూడు రోజులు పాటు కొత్త శాంపిల్స్ సేకరించకూడదని నిర్ణయించింది.

పాత శాంపిల్స్ పూర్తి అయిన తర్వాతే కొత్త శాంపిల్స్ సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వైరస్ పరీక్షలను ప్రైమరీ హెల్త్ సెంటర్లలోనూ భారీగా టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు కరోనా శాంపిల్స్ టెస్టింగ్  సేకరణ నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 8 టెస్టు సెంటర్లలో కరోనా శాంపిల్స్ సేకరించడాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. 

మరోవైపు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా కనిపిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టుల సంఖ్య పెరగడంతో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు నిండిపోయాయి. కొన్ని ఆస్పత్రుల్లో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. 23 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దాదాపు 11 వాటిల్లో బెడ్స్‌ పూర్తిగా నిండిపోయినట్టు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా రోగుల సంఖ్య పెరిగిపోయింది.

హైదరాబాద్‌ చుట్టూ ఉన్న జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వారిలో కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుుతున్నారు. మరికొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దగ్గు, జ్వరం, జలుబు వచ్చిందంటే చాలు కరోనా భయంతో టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్స్ ల వైపు పరుగులు తీస్తున్నారు. అసలు అలాంటి లక్షణాలు లేకున్నా..టెస్టులు చేయాలయని ప్రైవేటు ల్యాబ్స్ లకు వెళ్తుడటంతో రద్దీగా మారిపోయాయి. 

Read: హైదరాబాద్‌లో సిట్యుయేషన్ సీరియస్, కరోనా రోగులతో నిండిపోయిన ప్రైవేట్ ఆసుపత్రులు , బెడ్స్ ఫుల్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *