బ్రిక్స్ సమ్మిట్ లో పాక్ పై మోడీ ఫైర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

PM Modi slams Pakistan ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిక్స్ 12వ​ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-17,2020)వర్చువల్ ​గా ప్రసంగించిన మోడీ..ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా పాకిస్తాన్ ను ఉద్దేశించి మాట్లాడిన మోడీ.. ఉగ్రవాదానికి మద్దతునిస్తోన్న,ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న దేశాలను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను సంస్థాగతంగా ఎదుర్కోవాలని మోడీ తెలిపారు.బ్రెజిల్,రష్యా,చైనా,దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ బ్రిక్స్ సమ్మిట్ లో భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’ క్యాంపెయిన్ గురించి కూడా మోడీ ప్రస్తావించారు. సమగ్ర సంస్కరణ విధానాన్ని భారత్ ప్రారంభించిందని మోడీ తెలిపారు. స్వయం సమృద్ధ మరియు కరోనా తర్వాత పునరుద్దరణ భారత్ ప్రపంచ ఎకానమీకి ఓ శక్తి విస్తరణగా మరియు గ్లోబల్ వాల్యూ చైన్స్ లో బలమైన సహకారంగా ఉండబోతుందన్న నమ్మకం ఆధారంగా ఈ క్యాంపెయిన్ ఉందని మోడీ తెలిపారు.కరోనా సమయంలో మనమందరం దీనికి ఓ ఉదాహరణని కూడా చూశామని మోడీ తెలిపారు. భారతీయ ఫార్మా రంగం సామర్థ్యం కారణంగా 150కిపైగా దేశాలకు భారత్ అత్యవసర మెడిసిన్స్ ని అందించగలిగిందని మోడీ తెలిపారు. భారత వ్యాక్సిన్ ఉత్తత్పి మరియు డెలివరీ సామర్థ్యం ఈ విధంగా మానవతా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని మోడీ తెలిపారు.

Related Tags :

Related Posts :