bride groom suicide in wedding hall

కారణం ఇదేనా : కాసేపట్లో తాళి కట్టాలి.. ఇంతలో వరుడు ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తాళి కట్టడానికి కాసేపటి ముందు వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వరుడి

తాళి కట్టడానికి కాసేపటి ముందు వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వరుడి ఆత్మహత్య ఇరు కుటుంబాల వారిని షాక్ కి గురి చేసింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా వరుడు ఆత్మహత్యకి పలు కారణాలు వినిపిస్తున్నాయి.

దిల్‌సుఖ్‌నగర్ లలితానగర్‌కు చెందిన నక్కెర్తి శ్రీనివాస్‌ చారి, దివంగత పద్మజారాణి దంపతులకు ఎన్‌ఎస్ సందీప్(24) ఒక్కడే కుమారుడు. 16 ఏళ్ల క్రితం సందీప్ తల్లి మృతి చెందింది. సందీప్ తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో సందీప్ సరూర్‌నగర్‌లోని అమ్మమ్మ తాతలు వసంత, జంగేశ్వరరావుల దగ్గర ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు. అప్పుడప్పుడు మలక్‌పేటలోని చిన్నమ్మ, చిన్నాన్న భారతి, బ్రహ్మచారిల దగ్గరికి మాత్రమే వెళ్లేవాడు.

బీటెక్ పూర్తి చేసిన సందీప్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అదే సమయంలో మరో మంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఇంతలో పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు కోరారు. అయితే తనకు పెళ్లి ఇష్టం లేదని సందీప్ చెప్పాడని, ఇంట్లో వాళ్లు పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తున్నారని సందీప్ నిత్యం కుంగిపోయేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. 

సందీప్ మృతికి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కారణం అని సమాచారం. తల్లి లేకపోవడం, ఇటీవలే తాత చనిపోవడంతో పాటు బంధువుల నుంచి వేధింపులతో మనోవేదనకు గురయ్యాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరు అత్తలు, వారి ఇద్దరు కుమారులే సందీప్ మృతికి కారణం అని తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం వరుడు, వధువు ఇళ్లలో తీవ్ర విషాదం నింపింది. సందీప్ ఆత్మహత్యతో వధువు పరిస్థితి దయనీయంగా మారింది. 

Related Posts