కొన్ని గంటల్లో పెళ్లి.. బ్యూటీ పార్లర్‌లో వధువు హత్య..! మాజీ ప్రియుడే చంపేశాడా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొన్ని గంటల్లో పెళ్లి.. కట్ చేస్తే బ్యూటీ పార్లర్‌లో వధువు హత్యకు గురైంది. పెళ్లి అలంకరణలో మేకప్ వేసుకుంటున్న సమయంలో వధువును ఎవరో గొంతు కోసి హత్య చేశారు. ఇంతకీ ఆమెను ఎవరూ హత్య చేసారు అన్నది మిస్టరీగా మారింది. మధ్యప్రదేశ్‌లోని రత్లం జిల్లాలో జావోరాలో ఓ బ్యూటీ పార్లర్‌లో వధువు మేకప్ వేసుకుంటున్న సమయంలో పెళ్లికి కొన్ని గంటల ముందు ఈ హత్యా ఘటన జరిగింది.

నివేదిక ప్రకారం.. ఈ హత్యలో ఆమె మాజీ ప్రేమికుడు రామ్ యాదవ్ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ వ్యక్తి ఆమె గొంతు కోసి రాజస్థాన్‌కు పారిపోయాడని పోలీసులు ఆరోపించారు. వధువు హత్యకు సాయం చేసిన నిందితుడి స్నేహితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. బాధితురాలు సోను యాదవ్‌గా గుర్తించారు. ఆమె రెండోసారి వివాహం చేసుకుంటోంది. షాజాపూర్ జిల్లాలో నివసిస్తున్న మహిళ పెళ్లి రోజు ఉదయం తన కుటుంబంతో కలిసి జౌరా పట్టణానికి వెళ్లింది.

కొంత సమయం తరువాత.. ఆమె తన బంధువుతో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్ళింది. పార్లర్‌కు చేరుకున్న వెంటనే.. సోనుకు మాజీ ప్రియుడు రామ్ యాదవ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ఆమె అతని కాల్స్ పట్టించుకోలేదు. యాదవ్ తన స్నేహితుడి మొబైల్ నంబర్ నుంచి సోనుకు ఫోన్ చేశాడు. తెలియని నంబర్ కావడంతో సోను ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది. యాదవ్ ఆమె ఎక్కడ ఉందో చెప్పమని అడిగాడు. మొదట్లో అంగీకరించని బాధితురాలు తర్వాత అతడి మాటలు నమ్మి తాను ఉన్న ప్రాంతాన్ని చెప్పింది. యాదవ్ బ్యూటీ పార్లర్ వద్దకు వచ్చి సోను గొంతు కోసి చంపేశాడు.

సోనును హత్య చేసిన వెంటనే రామ్ యాదవ్ తన స్నేహితుడు పవన్ పంచల్ బైక్ మీద పారిపోయాడు. పంచల్ నిందితుడిని రాజస్థాన్‌లోని బస్ స్టాప్ వద్ద వదిలేశాడు. రత్లం నుంచి రాజస్థాన్ సరిహద్దు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచల్‌ను తిరిగి రత్లం వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఇప్పుడు రామ్ యాదవ్‌ను పట్టుకోవటానికి గాలిస్తున్నారు.

పంచల్ చెప్పిన ప్రకారం.. సోను యాదవ్ మూడేళ్ల క్రితం ఒక కార్యక్రమంలో రామ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వారిద్దరికి ఎఫైర్ నడిచింది. రామ్ యాదవ్ కు సోనూ రెండో పెళ్లి గురించి తెలిసింది. సోను యాదవ్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సోనును చంపే తన ప్రణాళిక గురించి రామ్ పంచల్‌కు చెప్పాడు. ఆమె ఉన్న బ్యూటీ పార్లర్ దగ్గరకు వచ్చి గొంతు కోసి హత్య చేశాడు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ  దేవరాజ్ వల్లే అక్క ఆత్మహత్య చేసుకుంది, RX100 నిర్మాత చాలా మంచోడు.. టీవీ నటి శ్రావణి సోదరుడు

Related Posts