లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

వేములవాడలో కూలిన బ్రిడ్జ్

Published

on

Bridge Under Construction Collapses Due To Heavy Rains In Vemulawada

సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం (సెప్టెంబర్ 19, 2019)న రాత్రి కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. వేములవాడ మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కుప్పకూలిపోయింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తోన్న భారీ వరద నీరు ఉదృతికి నిర్మాణ దశలో  ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. 

2 ఏళ్ల క్రితం 16కోట్ల రూపాయిలతో ప్రభతు్వం ఈ  వంతెన నిర్మాణ పనులు చేపట్టగా..ఇప్పటి వరకూ దానికి సంబంధించి నిధులు విడుదల కాలేదు. దీంతో కాంట్రాక్టర్ చేసేందేమీ లేక ఆరు నెలల నుంచి వంతెన నిర్మాణ పనులను నిలిపివేశారు. 190 మీటర్ల పొడవు గల బ్రిడ్జి ఇప్పటికే 150 మీటర్ల వరకు సెంట్రింగ్‌ పనిపూర్తయింది. 

అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒక్క పిల్లర్‌ ఒరిగిపోగా, బ్రిడ్జిలోని 16 బీములకు పగుళ్లు  వచ్చాయి. దీంతో ఈ బ్రిడ్జి కూలిపోవడానికి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని అక్కడి స్థానికులు చెబుతున్నారు.