Home » సి ‘రాజ్’ : బంతితో పవర్ చూపించాడు, అందరి నోళ్లు మూయించాడు
Published
1 month agoon
Mohammed Siraj : మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో మారుమోగుతున్న పేరు. నెల రోజుల ముందు వరకు అతడిపై విమర్శలు చేసిన వారు.. వ్యంగ్యంగా మాట్లాడుతూ కౌంటర్లు వేసినవారు కోకల్లలు. రన్ మెషిన్ అంటూ దేశవ్యాప్తంగా ట్రోలింగ్‌కు గురైన సిరాజ్.. ఆసిస్ పర్యటనలో తన మ్యాజికల్ బౌలింగ్‌తో అందరి నోళ్లు మూయించాడు. సీనియర్ బౌలర్లంతా గాయపడి టీమ్‌కు దూరమైన వేళ.. ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్.. టెస్ట్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లతో సత్తా చాటాడు. గబ్బా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసిస్ వెన్నువిరిచాడు.
1994లో జననం : –
గల్లీలో ఆడేవారు కూడా విమర్శించే దగ్గర నుంచి… ఏకంగా క్రికెట్ దేవుడి ప్రశంసలు అందుకునేంత ఎత్తు ఎదిగాడు సిరాజ్. జీవితంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్న సిరాజ్ తన ఆత్మవిశ్వాసంతోనే విమర్శకుల నుంచి కూడా ప్రశంశలందుకునే స్థాయికి ఎదిగాడు. 1994లో జన్మించిన సిరాజ్.. మంచి పేస్, స్వింగ్ కలిగిన సిరాజ్.. HCA డివిజన్ లీగ్‌లో సత్తాచాటాడు. అక్కడి నుంచి హైదరాబాద్ అండర్-23 జట్టుకు ఎంపికైన సిరాజ్ వెనుదిరిగి చూడలేదు.
హైదరాబాద్ రంజీ ట్రోఫీ, ఐపీఎల్ : –
అండర్-23 జట్టు తరఫున సత్తాచాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికైన సిరాజ్.. కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు. టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్.. 2016
హైదరాబాద్ రంజీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. ఒకరకంగా టీమ్ ఇండియాకు సిరాజ్ ఎంపికలో భరత్‌దే కీలకపాత్ర… రంజీ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడిన సిరాజ్‌కు ఐపీఎల్ రూపంలో జాక్‌పాట్ తగిలింది. 2017 లో జరిగిన వేలం పాటలో 23 ఏళ్ల సిరాజ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 2.6 కోట్ల రూపాయలకు దక్కించుకోవడం.. పెద్ద సంచలనమైంది. ఐపీఎల్ తర్వాత నేరుగా ఇండియా-ఎ జట్టుకు ఎంపికైన సిరాజ్‌ను కోచ్ రాహుల్ ద్రవిడ్ మరింత సానబెట్టాడు. సఫారీ పర్యటనలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఏకైక అనధికారిక టెస్టులో ఐదు వికెట్లు తీశాడు.
ఫామ్ కోల్పోయిన సిరాజ్ : –
కొనాళ్ల పాటు సహజసిద్ధమైన స్వింగ్‌తో బ్యాట్స్మెన్లకు ముప్పతిప్పలు పెట్టిన సిరాజ్ క్రమంగా ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్లో భారీగా పరుగులు సమర్పిస్తూ రన్ మెషిన్ ముద్ర వేసుకున్నాడు. దీంతో అతడి పనైపోయిందని అందరూ భావించారు. కానీ.. సిరాజ్ నిరాశ చెందలేదు… అంతటితో ఆగలేదు… కోల్పోయిన ఫామ్‌ను తిరిగి సాధించాడు.. తన బంతి పవర్ ఏంటో చూపించాడు… అందరి నోళ్లు ముయించాడు.
తండ్రిని పొగొట్టుకున్నా : –
ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు ముందు తండ్రిని పొగొట్టుకున్న సిరాజ్.. తన తండ్రి నేర్పిన పాఠాలతో సిరీస్‌లో సత్తా చాటాడు. బుమ్రా, షమీ లేని లోటును సిరాజ్ కనపడనివ్వలేదు. బ్రిస్బేన్ టెస్ట్‌కు ముందు కేవలం రెండే మ్యాచ్‌లు అనుభవమున్న సిరాజ్.. సీనియర్లా భారత్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. టెస్ట్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల తన ఖాతాలో వేసుకోని రికార్డు సృష్టించాడు.
అంత్యక్రియల డబ్బుని కూడా వదలని ప్రభుత్వ ఉద్యోగి.. రూ.20వేల చెక్కుకి రూ.10వేల లంచం డిమాండ్
టీమిండియాకు సెలెక్ట్ అయినప్పుడు కొట్టి లేపాను: కోహ్లీ
కుక్కపిల్లలను చంపి నిప్పంటించిన కిరాతకుడి సమాచారం ఇచ్చిన వారికి రూ.50వేల నగదు
బ్రిస్బేన్ టెస్ట్ : టీమిండియా ఎదుట టఫ్ టార్గెట్
కుక్కతోకే కాదు.. కంగారుల తోక వంకరే
ఆస్ట్రేలియా – ఇండియా మూడో టెస్టు, వర్షం అడ్డంకి