Britain Women Lisa Graves n't stopped hiccuping since she was pregnant 12 years ago

విచిత్రం : ఆమెకు 12 ఏళ్లుగా ఎక్కిళ్లు ఆగట్లేదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎక్కిళ్లు. ప్రతీ ఒక్కరికీ వస్తాయి. ఆ సమయంలో కాసిని మంచినీళ్ళు తాగితే ఆగిపోతాయి. కానీ గంటల తరబడే కాదు..రోజులూ కాదు.. నెలల కూడా కాదు ఏకంగా సంవత్సరాల తరబడి ఎక్కిళ్లు వస్తే..దాన్నేమంటాం. ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అటువంటి ఇబ్బందిని గత 12 సంవత్సరాల నుంచి పడుతోంది ఓ మహిళ. ఆమె పేరు లీసా గ్రేవ్స్, వయస్సు 27. బ్రిటన్ నివాసి. బ్యూటీషియన్ గా పనిచేస్తుంటుంది లీసా గ్రేవ్స్. 

ఎక్కిళ్లు నుంచి ఉపశమనం పొందేందుకు అన్ని రకాల ట్రీట్ మెంటులు తీసుకుంది. స్నేహితులు,బంధువులు ఎవరికి తోచిన సలహాలు వారుచెప్పారు.వాటన్నింటినీ పాటించింది. కానీ ఫలితంలేదు. ఇక ఏమీ చేయలేక వాటికి అలవాటు పడిపోయింది.  ఈ ఎక్కిళ్లు ఎందుకొచ్చాయో..ఎందుకు తగ్గటంలేదో ఏ డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఎక్కిళ్లను తగ్గించలేకపోయినా..కనీసం దానికి కారణమేంటో తెలుసుకోవటానికి ఎన్నో టెస్ట్ లు చేశారు. కానీ  తెలియలేదు. 

2008లో ప్రసవం జరిగిన సమయంలో ఆమెకు హార్ట్‌ఎటాక్ వచ్చింది. ఆ సమయంలో వచ్చిన సైడ్‌ఎఫెక్ట్ వల్లే ఇలా ఎక్కిళ్లు వచ్చు ఉండవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు.  ఇంత సుదీర్ఘ కాలం ఎక్కిళ్లతో బాధపడటం విశేషం కదా. దీంతో ఈ విషయం మీడియా దాకా వెళ్లింది. ఈ విషయంపై లిసా గ్రేవ్స్ మీడియాతో మాట్లాడుతూ..తన ఎక్కిళ్లకు తన కుటుంబం సభ్యులతో పాటు తన  కస్టమర్లు కూడా అలవాటు పడిపోయారని నవ్వూతూ చెప్పింది.

ఎక్కిళ్ల వల్ల తన వ్యాపారానికి పెద్దగా ఇబ్బందులేవీ లేవని చెప్పింది. ఎక్కిళ్ల బారిన పడిన తర్వాత నాలుగేళ్లకు లిసా మరో పాపకు కూడా జన్మనిచ్చింది. ఈ ఎక్కిళ్ల వల్ల లీసా ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పడంతో లీసా, ఆమె కుటుంబం వీటి గురించి పెద్దగా ఆందోళన చెందడంలేదు.

Related Posts