Home » ద్యేవుడా……విమానంలో ఎయిర్ హోస్టెస్ వ్యభిచారం !
Published
2 months agoon
By
murthyBritish Airways hostess being probed for offering inflight pleasure for price : విమానంలో మీరు శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా ? అంటూ ఒక ఎయిర్ హోస్టెస్ తన సోషల్ మీడియా లో ఇచ్చిన ప్రకటన కలకలం రేపింది. లండన్ లో నివసించే ఒక ఎయిర్ హోస్టెస్ బ్రిటీష్ ఎయిర్ వేస్ లో పని చేస్తుంది. ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. విమానంలో మీరు శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా ? అయితే మీరు నాకు కొంత డబ్బులు చెల్లించండి…మీరు కోరుకున్న విధంగా గడపండి అంటూ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. దీనిపై అప్రమత్తమైన బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థ సోమవారం విచారణకు ఆదేశించింది.
ప్రస్తుతానికి గుర్తించని సదరు ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియా వేదికగా విమానంలో వ్యభిచరిస్తానంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం విమానంలో అభ్యంతరకర స్థితిలో దిగిన తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన లోదుస్తులను కూడా అమ్ముతానని వాటిలో ప్రచారం మొదలుపెట్టింది. లోదుస్తుల ధర దాదాపు 2,471 రూపాయలు ఉంటుందని కూడా ప్రకటించింది.
ఒకవేళ ఆమెను హోటల్ లో కలవాలనుకుంటే చార్జీలు పెరుగుతాయని కూడా తెలిపింది. ఆమెను ముందుగా కలిసి మాట్లాడాలంటే 50 పౌండ్ల స్టెర్లింగ్ రుసుము చెల్లించాలని ఎంట్రీ ఫీజు కూడా పెట్టింది. మీరు కలవాలనుకున్న ప్లేస్ ను బట్టి రేటు కూడా మారతుందని, ఇందులో బేరసారాలు ఉండవని నిక్కచ్చిగా ప్రకటించింది. నేను పని కోసం హోటల్ బుక్ చేస్తే అక్కడ మీటింగ్ జరుగుతుందని ఆమె తన పోస్ట్ లో వివరించింది.
ఈ పోస్టులు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆదివారం చాలా వరకు ఆమె తన పోస్టులను తొలగించింది. అయితే ఆ ఎయిర్ హోస్టెస్ అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. భద్రంగా ఉండమంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మా తోటి ఉద్యోగుల నుంచి అన్ని వేళలా.. అత్యున్నత స్థాయి ప్రవర్తనను ఆశిస్తున్నాము. దీనిపై విచారణ చేపట్టాము’’ అని పేర్కొన్నాడు.