నదిలో పడిపోయిన విద్యార్థిని, కాపాడిన బ్రిటన్ దౌత్యవేత్త

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

British Diplomat Saves : అప్పటి దాక ప్రకృతి అందాలను చూస్తూ..ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. చైనాలో బ్రిడ్జీపై నడుస్తున్న ఓ విద్యార్థిని..ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయింది. కాపాడాలంటూ..కేకలు. వెంటనే 61 ఏండ్లున్న బ్రిటన్ దౌత్యవేత్త ఏ మాత్రం ఆలోచించకుండా..నదిలోకి దూకి ఆ విద్యార్థినిని కాపాడారు. అక్కడనే ఉన్న మరికొంతమంది..వారిద్దరికి సహాయం చేసి..ఒడ్డుకు చేరుకొనేలా సహకరించారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. వృద్దాప్యంలోను..విద్యార్థినిని కాపాడిన బ్రిటన్ దౌత్యవేత్తపై ప్రశంసలు కురుస్తున్నాయి. హీరో..అంటూ కొనియాడుతున్నారు. ఈ ఘటన ఊంగ్షాన్ లో చోటు చేసుకుంది.ఊంగ్షాన్ లో నదిపై ఉన్న బ్రిడ్జీ వద్ద ప్రకృతి అందాలను చూస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు. ఓ మహిళా విద్యార్థిని బ్రిడ్జీపై నడుచుకుంటూ..వెళుతోంది. ప్రమాదవశాత్తు..కాలు జారి నదిలో పడిపోయింది. ఆ సమయంలో..బ్రిటన్ కాన్సుల్ జనరల్ స్టీఫెన్ ఎల్లిసన్ అక్కడే ఉన్నారు. 61 ఏండ్ల వయస్సున్న ఇతను..ఏ మాత్రం ఆలోచించకుండా..కాళ్లకు ఉన్న షూస్ తీసేసి అమాంతం నదిలోకి దూకారు. కొట్టుకపోతున్న విద్యార్థిని పట్టుకున్నాడు. మెల్లిగా..ఒడ్డుకు చేరుకున్నారు.అక్కడే ఉన్న మరికొంత మంది వారికి సహకరించడంతో ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషయాన్ని చాంగ్కింగ్ లోని బ్రిటన్ మిషన్ సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. సకాలంలో నదిలోకి దూకడంతో యువతి..సృహ కోల్పోకుండా..ఉండగలిగిందంటూ..వెల్లడించింది. కాన్సులేట్ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చాంగ్కింగ్ లోని బ్రిటన్ కాన్సుల్ జనరల్ చేసిన పనికి మేమెంతో గర్వపడుతున్నామని చైనాలోని యూకే దౌత్య మిషన్ ట్వీట్ చేసింది. వృద్దాప్యంలోనూ…యువతిని రక్షించడానికి ప్రాణాలను ఫణంగా పెట్టడం ఆయన హీరోయిజానికి నిదర్శనమని నెటిజన్లు వెల్లడిస్తున్నారు.
ఇక ఎల్లిసన్ విషయానికి వస్తే..2014 నుంచి బీజింగ్ లోని బ్రిటీష్ రాయబార కార్యాలయంలో సీనియ్ దౌత్యవేత్తగా పనిచేశారు.

Related Tags :

Related Posts :