రెస్టారెంట్లలో‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్’పథకం…50 శాతం ఆఫర్ ప్రకటించిన లండన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మహమ్మారి లాక్ డౌన్ కారణంగా ప్రపంచ దేశాలన్నింటిని ఆర్ధిక పరిస్ధితి క్షీణించింది. లాక్ డౌన్ నుంచి బయటపడిన తరువాత దేశ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరిచేందుకు ప్రయత్నంలో భాగంగా లండన్ ప్రభుత్వం ఒక కొత్త ప్రభుత్వ పథకాన్నికి మెుదలు పెట్టింది. ఎవరైతే రెస్టారెంట్లలో భోజనం చేస్తారో వారి బిల్లులో సగం అంటే 50 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని ఛాన్సలర్ రిషి సునక్ బుధవారం(జూలై 8,2020) ఒక ప్రకటనలో తెలిపారు.

hotels offerదేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచడానికి ‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్ ’పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 10 డాలర్ల బిల్లులో సగం చెల్లిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఈ పథకం ఆగస్టు నెల నుంచి అందుబాటులోకి వస్తోంది. వారంలో మూడు రోజలు అంటే ప్రతి సోమవారం నుంచి బుధవారం మధ్య మాత్రమే వర్తిస్తుంది. కరోనా వైరస్ లాక్ డౌన్ నుంచి ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచే మినీ బడ్జెట్ ప్యాకేజీలో భాగం అని ఛాన్సలర్ రిషి పేర్కొన్నారు. ఈ పథకం మద్యపానంకు వర్తించదు.

దేశంలో కొన్ని ప్రాంతాల్లో మూడు నెలలకు పైగా మూసివేయబడిన రెస్టారెంట్, పబ్,బారులు తిరిగి ప్రారంభించబడ్డాయి. డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుగా వ్యాపారులు Gov.uk లో నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా పుడ్ స్టాండర్జ్స్ ఏజెన్సీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని సంబంధించిన మరిన్ని వివరాలను జూలై 13 విడుదల చేయబడతాయి. ఈ పథకం ఆగస్టు 3, 2020 నుంచి ప్రారంభమై ఆగస్టు 31, 2020 వరకు ఉంటుంది.

యాహూ ఫైనాన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకం వల్ల ప్రభుత్వం 500 నుంచి 629 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కానీ దీని ద్వారా 1.8 మిలియన్ ఉద్యోగాలకు ఉపాది కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో ఆహారం, రెస్టారెంట్లపై 15 శాతం వ్యాట్ తగ్గించిన్నట్లు అవుతుందని ఛాన్సలర్ ప్రకటించారు. పన్ను శాతం 20 నుంచి 5 శాతానికి తగ్గుతుంది.

Related Posts