లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

BS-6 వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఉండాల్సిందే..లేకపోతే బండిస్టార్ట్ కాదు

Published

on

BS-6 వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఉండాల్సిందే..లేకపోతే బండిస్టార్ట్ కాదు

బీఎస్ – 6 వాహనదారులకు గమనిక. వాహన ట్యాంకులో కనీసం లీటర్ పెట్రోల్ నిల్వ ఉండాలి. ఇంధనం లేకపోతే..ట్యాంకు నుంచి పెట్రోల్ పంపింగ్ కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వాడకంలో ఉన్న BS-4 వాహనాల్లో ఈ తరహా వ్యవస్థ లేకపోవడంతో ట్యాంకులో ఉన్న పెట్రోల్‌ను చివరిబొట్టు వరకు వాడుతుంటారు. అప్పటికీ ఇంజిన్ స్టార్ట్ కాకుండా..మొరాయిస్తే..ప్లగ్ (చౌక్)‌ను లాగితే స్టార్ట్ అవుతుంది.

అయితే..బీఎస్ – 6 వాహనాల్లో మాత్రం చౌక్ వ్యవస్థే లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆధునిక ఇంజిన్లతో వచ్చిన బీఎస్ – 6 వాహనాల్లో మాత్రం కనీసం లీటర్ పెట్రోల్ లేకపోతే బండి కదలదు. సదరు బైక్‌లపై ప్రయాణించాలనుకొనే వారు పెట్రోల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ వాహనాల ఇంజిన్‌‌ను స్టార్ట్ చేసిన సందర్భంలో శబ్దం సైతం వెలువడదని, శుద్ధి చేసిన చమురు వాడకంతో పాటు..బీఎస్ – 6 ఇంజిన్ కారణంగా..సాధారణం కన్నా..12 నుంచి 14 శాతం వరకు మెలైజీ కూడా అదనంగా వస్తుదంటున్నారు. 

* దేశ వ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ స్టేజ్ (BS-6) పెట్రోల్, డీజిల్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా ముందుకు తీసుకొచ్చింది. 
* శుద్ధి చేసిన ఈ చమురు ఏప్రిల్ 01వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లోని వాహనదారులకు అందుబాటులోకి రానుంది. 
* దీనితో సల్ఫర్ పరిణామం పది శాతమే ఉంటుంది. 

* ప్రస్తుతం వినియోగిస్తున్న BS -4  ఇంధనంలో సల్ఫర్ 50 శాతం వరకు ఉండడంతో వాహనాల నుంచి భారీగా కాలుష్యం గాలిలోకి వెలువడుతుంది. 
* బీఎస్ – 6 వాహనాలకు అనుగుణంగా..బైక్ ఇంజిన్లలో మార్పులు చేశారు. 
* ట్యాంకు నుంచి పెట్రోల్ నేరుగా ఇంజిన్‌కు చేరేలా తీర్చిదిద్దారు. 
* అంటే..వాహన ట్యాంకులో కనీసం లీటర్ పెట్రోల్ ఉండాలి.