Home » Andhrapradesh » భద్రతా దళాలకు తప్పిన పెనుముప్పు : మావోయిస్టులు అమర్చిన బాంబులు గుర్తించి పేల్చివేసిన బీఎస్ఎఫ్ సిబ్బంది
Updated On - 2:31 pm, Tue, 23 February 21
BSF personnel detonated bombs : ఏవోబీలో భద్రతా దళాలకు పెనుముప్పు తప్పింది. మావోయిస్టులు అమర్చిన బాంబులను బీఎస్ఎఫ్ సిబ్బంది పేల్చివేసింది. మావోయిస్టుల ఏరివేత కోసం ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలకు పెను ప్రమాదం తప్పింది.
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కదలిబంధ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన బాంబులను బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. ఐదు కిలోల శక్తివంతమైన బాంబును బీఎస్ఎఫ్ జవాన్లు పేల్చి వేశారు. కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.