BSNL నయా ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాల్స్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ మీ కోసం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.147ల ప్రీపెయిడ్ రీఛార్జ్ తో 30రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. అంతేకాకుండా రూ.247, రూ.1,999ప్రీపెయిడ్ ప్లాన్స్ తో సబ్‌స్క్రిప్షన్స్ సెలక్టెడ్ ప్లాన్స్ వ్యాలిడిటీ కూడా పొడిగించుకోవచ్చు. అదే సమయంలో రూ.78, రూ.551, రూ.249, రూ.447ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ ఎత్తేసింది.

అంతేకాకుండా రూ.144, రూ.792, రూ.1,584 పతాంజలి ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా తొలగించింది. బీఎస్ఎన్ఎల్ చెన్నై డివిజన్ సర్క్యూలర్ పాస్ చేస్తూ.. రూ.147ప్రీపెయిడ్ రీఛార్జ్ గురించి ప్రకటించింది. ఈ ప్లాన్ తో అన్ లిమిటెడ్ (లోకల్& ఎస్టీడీ) వాయీస్ కాల్స్, 250 ఎఫ్‌యూపీ నిమిషాలు కూడా పొందొచ్చు. కాలింగ్ బెనిఫిట్స్ .. ఎమ్టీఎన్నెల్ నెట్ వర్క్ కు కూడా కాల్స్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ లో 10జీబీ హై స్పీడ్ డేటాతో పాటు బీఎస్ఎన్నెల్ ట్యూన్స్ కూడా 30రోజుల వ్యాలిడిటీతో దక్కించుకోవచ్చు. ఈ ప్లాన్ ను ఎస్సెమ్మెస్ ద్వారా పొందాలనుకుంటే COMBO147 అని టైప్ చేసి 123కు మెసేజ్ చేయండి. దీనిని బీఎస్ఎన్ఎల్ సైట్ లో లేదా చానల్ టాప్-అప్ తో యాక్టివేట్ చేసుకోవచ్చు.

రూ.147ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటుగా రూ.247, రూ.1,999 ప్లాన్ల వ్యాలిడిటీని బీఎస్ఎన్ఎల్ 74రోజుల పాటు పొడిగించింది. ఆగష్టు 31వరకూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. రూ.247 ప్లాన్ వ్యాలిడిటీ 36రోజులుగా ఉంటే రూ.1,999ప్లాన్ వ్యాలిడిటీ 439రోజులుగా ఉంది. బీఎస్ఎన్నెల్ ట్యూన్స్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు.. లోక్ధున్, ఎరోస్ నౌ లో కంటెంట్ 30రోజుల పాటు దొరకొచ్చు.

Related Posts